WhatsApp New Feature : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. ఇది చాలా యూజ్ ఫుల్ బాస్.

వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగానే, లేటెస్ట్ గా, రీసెంట్ ఆన్ లైన్ కాంటాక్ట్స్ పేరుతో మరో యూజ్ ఫుల్ ఫీచర్ ను తీసుకువచ్చింది.

WhatsApp New Feature : ప్రతీ ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ముఖ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన యాప్స్‌లో ఇదీ ఒకటి. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

సాధారణంగా, మనకు తెలిసిన ఎవరైనా వాట్సాప్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నారని మనం ఎలా తెలుసుకోవాలి? దీని కోసం మీరు వ్యక్తి యొక్క ప్రొఫైల్‌ను క్లిక్ చేసి వీక్షించడం అవసరం. ఆన్‌లైన్‌లో ఉంటే ఆన్‌లైన్‌లో ఉన్నట్టు చూపిస్తుంది లేదా లాస్ట్‌ సీన్‌ ఎప్పుడుందో కనిపిస్తుంది. అలా కాకుండా ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఉన్నారో వారి జాబితాను ఒకచోట చూపిస్తే ఎలా ఉంటుంది, ప్రస్తుతం వాట్సాప్ ఇలాంటి ఫంక్షన్‌ను పరిచయం చేయడానికి కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫంక్షనాలిటీ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది.

ప్రస్తుతం, మనం వాట్సాప్‌లో ఎవరితోనైనా చాట్ చేయాలి అనుకుంటే , దిగువ కుడి వైపున ఉన్న ‘+’ చిహ్నాన్ని క్లిక్ చేసి, చాట్‌ను సెలక్ట్‌ చేసుకొని మెసేజ్‌ చేస్తుంటాం. అయితే ఇప్పుడు మీరు ‘+’ బటన్‌పై క్లిక్ చేసినప్పుడు, వాట్సాప్ మీకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న వారి జాబితాను అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్ వెర్షన్ 2.24.9.14 నడుస్తున్న ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం బీటా టెస్టింగ్‌లో ఉంది. ఇటీవల ఒకే చోట ఆన్‌లైన్‌లో ఉన్న వారి వివరాలను ప్రదర్శిస్తుంది.

మరో ఫీచర్‌.
ఇక స్టేటస్‌కు సంబంధించిన వాట్సాప్‌ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. యూజర్ల ఎంగేజ్‌మెంట్‌ కోసం ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారు ఎవరైనా కొత్తగా స్టేటస్‌ పెడితే వెంటనే పలానా వ్యక్తి స్టేటస్‌ పెట్టినట్లు మీకు ఒక నోటిఫికేషన్‌ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. త్వరలోనే యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌.

WhatsApp New Feature

 

 

 

 

 

Comments are closed.