Telugu Mirror : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విద్యాశాఖ టెట్ కి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్ 2024 పరీక్షలు మే 20 నుండి జూన్ 3 వరకు జరుగుతాయి. అభ్యర్థులు ఈ నెల 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం టీఎస్ టెట్‌కు (TS TET) అనుమతి ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. అధికారిక వెబ్సైటు (Website) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డీఎస్సీ (DSC) కంటే ముందే టెట్‌ను చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ టెట్ 2024 నోటీసును వెంటనే విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు అవకాశం ఉంటుంది.
Also Read : APPSC Group1 Exams 2024: ఈ నెల 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలు, చిత్తూరులో మూడు కేంద్రాల్లో పరీక్షలు
తెలంగాణలో డీఎస్సీ ప్రకటన..
తెలంగాణలో మెగా డీఎస్సీ 2024 ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్‌లు, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
దీనికి సంబంధించి, దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఏప్రిల్ 2. వరకు ఉంది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే, తెలంగాణ టెట్ 2024 ప్రకటన విడుదల చేశారు కాబట్టి ఇటు DSC దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థులు జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది.
తెలంగాణ డీఎస్సీ పరీక్ష తేదీలను విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జూలై 17 నుంచి జూలై 31 వరకు జరుగుతాయని టీఎస్ విద్యాశాఖ ప్రకటించింది. అలాగే ఇటీవల తెలంగాణ టెట్ 2024 ప్రకటన వెలువడిన తర్వాత డీఎస్సీ దరఖాస్తు గడువును పొడిగించింది. అభ్యర్థులు జూన్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : Half Day Schools Latest 2024: తెలంగాణలో నేటి నుండే ఒంటి పూట బడులు ప్రారంభం
ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు తాజా నియామకాలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు | వివరాలు |
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ | మార్చి 4, 2024 |
దరఖాస్తుల ప్రారంభ తేదీ | మార్చి 27, 2024 |
దరఖాస్తుల చివరి తేదీ | ఏప్రిల్ 10, 2024 |
పరీక్ష ప్రారంభ తేదీ | మే 20, 2024 |
పరీక్షల ముగింపు తేదీ | జూన్ 6, 2024 |
అధికారిక వెబ్‌సైట్ | https://tstet.cgg.gov.in/ |
తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… డీఎస్సీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇందులో అర్హత సాధిస్తే డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది.