valuable news for AAY rationcard holders : అంత్యోదయ అన్నయోజన (AAY) రేషన్ కార్డ్ హోల్డర్లకు తీపి కబురుని అందించింది. రేషన్ కార్డు హోల్డర్లకు చక్కెర, రేషన్ బియ్యం ఇవ్వాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏఏవై కార్డుదారులకు చక్కెర సరఫరా చేసేందుకు పలువురు రేషన్ వ్యాపారులు బియ్యంతో సరిపెట్టి చక్కెరను పక్కదారి పట్టిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పౌరసరఫరాల శాఖ కీలక ఉత్తర్వులు జారీ
చాలా మంది రేషన్ వ్యాపారులు డీడీలను కూడా కట్టట్లేదు. మరి కట్టినవాళ్లు చక్కెర రాలేదని చెబుతున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా చక్కెర అవసరమైన మొత్తాన్ని సేకరించి కార్డుదారులకు పంపిణీ చేయాలని ఏఏవై ఆదేశాలు జారీ చేసింది.
Also read : SSC Exam Dates 2024 changed Excellent Information : ఎస్ఎస్సీ పరీక్షల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదే
తెలంగాణలో ఏఏవై రేషన్ కార్డుదారులు ఎంతమంది?
తెలంగాణలో 5.99 లక్షల మంది ఏఏవై రేషన్ కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెల, కార్డుకు కిలోకు 599 టన్నుల చక్కెర అవసరం. ఈ మేరకు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో చక్కెర స్టోర్ చేయాలి. డీడీలు కట్టిన తర్వాత కార్డు కేటాయింపునకు అనుగుణంగా డీలర్లు చక్కెర తీసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో 17,235 మంది వ్యాపారులు ఉండగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి బియ్యం సరఫరా ప్రారంభమైంది. అయితే చాలా షాపుల్లో చక్కెర విరివిగా లభించడం లేదు. బియ్యం, గోధుమలు, పంచదార ఎంత ఇచ్చారో తెలిపే ప్రింటవుట్‌ను డీలర్లు కార్డుదారులకు అందించాలి. చాలా రేషన్ షాపుల్లో ఈ ప్రింట్లు కూడా ఇవ్వడం లేదు.
కొంత మంది వ్యాపారులు బియ్యంతో సరిపెట్టి చక్కెరను పక్కదోవ పట్టిస్తున్నారని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. బయట మార్కెట్‌లో చక్కెర ధర రూ.40 నుంచి 45 మధ్యలో ఉండగా, అంత్యోదయ కార్డులకు కిలోకు సబ్సిడీపై రూ.13.50 అందిస్తారు. పంచదార విక్రయదారులు సరిపడా సరుకులు అందిస్తే నిరుపేదలకు ఆసరాగా ఉంటుంది.
valuable news for AAY rationcard holders
Also Read : Successful PM Kisan Yojana : పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు వచ్చేది ఆ రోజే.. మరి ఇంతకీ ఈ-కేవైసీ పూర్తి చేశారా?