Aadhaar Lock: ఆధార్ లాక్ చేయడం ఎలానో తెలుసా? బ్యాంక్ ఖాతా ఉంటే ఇది పని తప్పనిసరి
భారతీయులకు ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. మీ బ్యాంక్ అకౌంట్ ను సురక్షితంగా ఉంచాలంటే, మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచడం తప్పనిసరి. వివరాల్లోకి వెళ్తే..
Aadhaar Lock: ఆధార్ కార్డు ఇప్పుడు మన జీవితంలో ముఖ్యం అయిపోయింది. అన్ని ప్రభుత్వ స్కీమ్‌లకు, బ్యాంకు ఖాతా తెరవలన్నా, ఆసుపత్రుల్లో (Hospitals) చేరాలన్న కూడా ఆధార్ (Aadhar) తప్పనిసరి అయింది. మన వేలిముద్రను నమోదు చేస్తే మన వివరాలు అన్నీఉంటాయి. దీన్ని అలుసుగా తీసుకుని సైబర్ నెరగాళ్ళు (Cyber Criminals) ఆన్లైన్ మోసాల (Online Fraud) కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే. సైబర్ నేరాగాళ్ళ నుండి బయోమెట్రిక్స్ (Bio Metrics) ను లాక్ చేయడమే సరైన మార్గం అని చెప్పవచ్చు. మనకు అవసరమైనప్పుడు అన్‌లాక్ చేయవచ్చు లేదా మనకు అవసరం లేనప్పుడు లాక్ చేయవచ్చు. బయోమెట్రిక్ సమాచారాన్ని మన ప్రమేయం లేకుండా ఎవరు వినియోగించలేరు.
బ్యాంకు వినియోగదారులకు బిగ్ అలర్ట్.
భారతీయులకు ఆధార్ కార్డు (Aadhar Card) ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. స్కామర్ల నుండి OTPలను నుండి ఇంకా మీ ఖాతా నుండి నేరుగా డబ్బును దొంగిలించబడకుండా ఈ బయోమెట్రిక్ (Bio Metric) సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్‌తో లింకు అయి ఉంటే, మీ బ్యాంక్ అకౌంట్ పట్ల తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే, మోసపోయే అవకాశాలు ఉంటాయి.
Also Read: Phone Hacking : మీ ఫోన్ హ్యాక్ అయిందని మీకేలా తెలుస్తుంది? ఈ టిప్స్ తో కనిపెట్టేయండి.
ఆధార్ బయోమెట్రిక్ లాకింగ్ ప్రాసెస్ :
మీ బ్యాంక్ అకౌంట్ ను సురక్షితంగా ఉంచాలంటే, మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సీక్రెట్ గా ఉంచండి. ఆన్లైన్ (online) లో మీ ఆధార్ బయోమెట్రిక్‌లను ఎలా జాగ్రత్తగా ఉంచాలో ఇప్పుడు మనం చూద్దాం.
ముందుగా, నా ఆధార్ వెబ్సైట్ (My Aadhaar) ని సందర్శించండి
మీ సర్చ్ బాక్స్ లో “My Aadhaar” అని టైప్ చేసి, ఆపై లింక్‌పై క్లిక్ చేయండి.
మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.
My Aadhaar పేజీలో, లాగిన్ ఆప్షన్ ను ఎంచుకోండి.
మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
“login with otp” ఆప్షన్ ను క్లిక్ చేయండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
బయోమెట్రిక్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయండి.
“my adhar update” విభాగానికి వెళ్ళండి.
“బయోమెట్రిక్స్ లాక్/అన్‌లాక్” క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ మరియు OTPని మళ్లీ నమోదు చేయండి.
మీ బయోమెట్రిక్ సమాచారాన్ని భద్రపరచడానికి, “లాక్ బయోమెట్రిక్స్”పై క్లిక్ చేయండి.
ఇక, మీరు మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు.
సైబర్ నెరగాళ్ల నుండి రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే, మనం కూడా మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.
Comments are closed.