Vaastu Tips : ప్రతిరోజూ కర్పూరం తో ఇంట్లో ఇలా చేయండి, శుభ ఫలితాలను పొందండి

కొంతమందికి ప్రతిరోజూ పూజ చేయడం అలవాటు ఉంటుంది. ఎవరు ఎప్పుడు పూజ చేసినా హారతి ఇవ్వడమనేది సాధారణంగా జరిగే విషయం. వాస్తు ప్రకారం కర్పూరం ను ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే వివిధ రకాల సమస్యలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

కొంతమందికి ప్రతిరోజూ పూజ చేయడం అలవాటు ఉంటుంది. మరి కొంతమంది శుక్రవారం లేదా శనివారం లో మాత్రమే పూజలు చేస్తుంటారు. ఇలా ఎవరికి వాళ్లు తగిన విధంగా పూజలు అనేవి చేస్తుంటారు. ఎవరు ఎప్పుడు పూజ చేసినా హారతి ఇవ్వడమనేది సాధారణంగా జరిగే విషయం.

అయితే కర్పూరం (Camphor) వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు బాధలు తొలగించుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలియదు. వాస్తు ప్రకారం కర్పూరం ను ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే వివిధ రకాల సమస్యలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ప్రతిరోజు ఇంట్లో హారతి కర్పూరం వెలిగించడం వల్ల కలిగే శుభ ఫలితాలను తెలుసుకుందాం.

వాస్తు దోషం :

ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే ఆ ఇంట్లో ( home)నివసించేవారికి అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో వాస్తు దోషం ఉన్నవారు ఆ దోషాన్ని పోగొట్టు కోవాలంటే ఇంటి మూలల లో (corners) కర్పూరం వుంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోయి ఆ ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది.

Vaastu Tips : Do this at home with camphor daily for good results
Image Credit : Her zindagi

మానసిక ఒత్తిడి :

ఇంట్లో హారతి కర్పూరం వెలిగిస్తే మనసు ప్రశాంతంగా (calmly) ఉంటుంది. కర్పూరం, ధూపం, దీపం మనసును తేలిక చేస్తుంది.
కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి ఒత్తిడి (stress) తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Also Read : Vaastu Tips For Home : మీ ఇల్లు సిరిసంపదల నిలయంగా మారాలంటే ఈ బొమ్మలు ఏ దిశలో ఉండాలో తెలుసుకోండి.

ఇంట్లో గొడవలు తగ్గుతాయి :

ఇంట్లో ప్రతిరోజు కర్పూరం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి (Positive energy) అనేది పెరుగుతుంది. తద్వారా ఇంట్లో సంపద మరియు శ్రేయస్సు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు (quarrels) జరుగుతుంటే కర్పూరం వెలిగించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవితం ఆనందమయం అవుతుంది.

ఆర్దిక అభివృద్ధి :

ఆర్థికంగా అభివృద్ధి (Economic development) చెందాలంటే ఇల్లు లేదా ఆఫీస్ మరియు షాపులలో కర్పూరాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో ఆహారానికి మరియు డబ్బుకి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా చికాకులు గొడవలు తగ్గిపోతాయి. ఒత్తిడి కూడా తగ్గిపోయి ఆరోగ్యం (health) మెరుగు పరచడంలో సహాయపడుతుంది.

Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!

కాబట్టి వాస్తు శాస్త్రం మీద నమ్మకం (trust) ఉన్నారు ప్రతిరోజు ఇంట్లో హారతి కర్పూరాన్ని వెలిగించండి. తద్వారా మానసిక ప్రశాంతత, సంపద మరియు శ్రేయస్సును పొందండి.

Comments are closed.