Audi Q6 e-tron Revolutionary EV: 2024 లో ఆడి తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ని రిలీజ్ చేయబోతుంది, ఆ వెహికల్ పూర్తి వివరాలు మీ కోసం.

ఆడి క్యూ6 ఇ-ట్రాన్ అనేది ఆడి ప్రీమియం ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ (పిపిఇ)పై నిర్మించబడిన మొదటి మోడల్, ఇది కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు E3 1.2 అని పిలువబడే ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్ తో వస్తుంది, ఆ వివరాలు ఇపుడు చూద్దాం.

Audi Q6 e-tron

Audi Q6 e-tron :ఆడి యొక్క కొత్త ప్రీమియం ప్లాట్‌ఫారమ్ ఎలక్ట్రిక్ (PPE)పై నిర్మించిన ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనం ఆడి Q6 ఇ-ట్రాన్‌. ఈ వినూత్న మోడల్ లేటెస్ట్ టెక్నాలజీ మరియు స్టైలిష్ డిజైన్‌తో ఆడి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. ఆకట్టుకునే రేంజ్, పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ మరియు విలాసవంతమైన ఇంటీరియర్‌తో, ఆడి క్యూ6 ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త మార్క్ ని సెట్ చేస్తుంది. ప్రీమియం డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన ఈ కారు ఆడి యొక్క సిగ్నేచర్ స్టైల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్‌తో స్థిరమైన మొబిలిటీని ఆఫర్ చేస్తుంది.

Audi Q6 e-tron Design

-ఫ్రంట్ గ్రిల్ సాధారణంగా ఆడి రెగ్యులర్ లోగో తో వస్తుంది కానీ బంపర్ లోపల క్లోజ్ అయిపోయి ఉంటుంది, అయితే బంపర్ ఏరియా నుండి చాలా వరకు ఎయిర్ ఫ్లో అవుతుంది.
-హెడ్‌లైట్‌లలో ఎనిమిది డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయ్, అలాగే డే టైం రన్నింగ్ లంప్స్ (DRLలు) కూడా ఉన్నాయి.
-సైడ్ ప్రొఫైల్‌లో స్టైల్ గ లైన్స్ డిజైన్ చేయబడ్డాయి, ఓవరాల్ గ ఒక పవర్ఫుల్ లుక్ తో ఈ వెహికల్ వస్తుంది.
-వెనుకవైపు వివిధ యానిమేషన్‌లను డిస్ప్లే చేయగల OLED ప్యానెల్‌లతో లైట్ బార్‌ ఉంది.

Audi Q6 e-tron Interior

-ఇంటీరియర్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇతర కంట్రోల్స్ ఉండే కొత్త కర్వ్ షేప్ డిస్‌ప్లే ఉంది.
-మూడు స్క్రీన్‌లు ఉన్నాయి: 11.9-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 14.5-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు 10.9-అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే.
– ఈ కార్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ Android కార్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది మరియు Apple CarPlay 2 తో వస్తుంది.
-ఈ కారు మీ అలవాట్ల ఆధారంగా అడ్జస్ట్మెంట్ ని సూచించడం మరియు తెలివైన వాయిస్ ఆదేశాలను అందించడం వంటి వివిధ AI-ఆధారిత ఫీచర్స్ అందిస్తుంది.
-ఇంటీరియర్ డిజైన్‌లో ప్రీమియం మెటీరియల్స్ మరియు డిఫరెంట్ మోడ్స్ లో యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.

Audi Q6 e-tron Performance

-Q6 e-tron రెండు వెర్షన్లలో వస్తుంది: సాధారణ Q6 మరియు SQ6.
-రెండు వెర్షన్లు ఆల్-వీల్ డ్రైవ్ (క్వాట్రో) తో వస్తున్నాయి.
-సాధారణ Q6 387 హార్స్‌పవర్‌ను జెనరేట్ చేస్తుంది, 5.9 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది మరియు 625 కిమీ (WLTP) రేంజ్ కలిగి ఉంటుంది.
-SQ6 517 హార్స్‌పవర్‌ను జెనరేట్ చేస్తుంది, 4.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది మరియు 598 కిమీ (WLTP) రేంజ్ కలిగి ఉంది.
-10% నుండి 80% వరకు ఛార్జింగ్ సమయం సుమారు 20 నిమిషాలు, గరిష్ట ఛార్జ్ వేగం 270 kW.

Audi Q6 e-tron Availability and Pricing

-ఆడి క్యూ6 ఇ-ట్రాన్ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.
-దీని ధర 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

 

Audi Q6 e-tron Specifications

Specification Regular Q6 SQ6
Power 387 horsepower 517 horsepower
Acceleration (0-100 km/h) 5.9 seconds 4.3 seconds
Range (WLTP) 625 km 598 km
Battery 100 kWh 100 kWh
Charging Time (10-80%) 20 minutes 20 minutes
Maximum Charge Speed 270 kW 270 kW
Drive Type Quattro (AWD) Quattro (AWD)
Infotainment Screen 14.5-inch 14.5-inch
Passenger Display 10.9-inch 10.9-inch
Operating System Android Car OS Android Car OS
Integration Apple CarPlay 2 Apple CarPlay 2
AI Features Yes Yes

Audi Q6 e-tron

 

Comments are closed.