Double Ismart : డబుల్ ఇస్మార్ట్ లో మరో స్పెషల్ సాంగ్..స్టార్ హీరోయిన్ తో పూరి సంప్రదింపులు..
ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
Double Ismart : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న పూరి జగన్నాథ్ గత ఏడాది లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ (Disaster) ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తర్వాత వెంటనే విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. జనగణమన అనే ఆ ప్రాజెక్టు పై అఫీషియల్ గా ఒక క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read : Railway Destination Alert : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రైళ్లలో హాయిగా నిద్రపోండి.
అయితే ఊహించిన విధంగా ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) ఫ్యాన్స్ కు నచ్చే విధంగానే అదిరిపోయే కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని పూరి సరికొత్త కథతో రెడీ అయినట్లుగా తెలుస్తోంది. 2019లో రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా వచ్చిన కంప్లీట్ మాస్ మసాలా యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా దాదాపు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ముందుగానే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం విశేషం. అయితే ఈ సినిమాలో ఇప్పటికే ఓ ప్రత్యేక ట్యూన్‌ని చేర్చారు. ఇప్పుడు మరో ప్రత్యేకమైన చిన్న పాటను జోడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్‌కు (Climax) ముందు మారుతున్న సీక్వెన్స్‌లో ప్రత్యేక చిన్న పాటను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న ట్యూన్లో మరో స్టార్ హీరోయిన్ కనిపిస్తుంది.
Also Read : PM Kisan Mandhan Yojana : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం..రైతులకు నెలనెలా రూ. 3 వేల పెన్షన్..
ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Comments are closed.