Driving License With Out Test: RTO ఆఫీసులో డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే మీరు డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు, ఎలానో తెలుసుకోండి.

సెంట్రల్ గవర్నమెంట్ మరియు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హై వేస్ తెచ్చిన కొన్ని కొత్త మార్పులు వల RTO ఆఫీసు కి వెళ్ళకుండానే బైక్, కార్ లైసెన్సు పొందవచ్చు.

Telugu Mirror: భారతదేశంలో మనం బైక్, కార్ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) అనేది చాలా ముఖ్యమైనది, అది లేకపోతే మనం చాలా సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ పోలీస్ లకి చిక్కితే ఫైన్ కూడ వేస్తారు. కొన్ని సార్లు బండి కూడా సీజ్ చేసే ప్రమాదం ఉంది, సమయం బాగలేక ఏదైనా ప్రమాదం జరిగితే లైసెన్స్ లేకపోవటం వలన మనదే తప్పు అవుతుంది, కుటుంబ సభ్యులు అంతా చాలా చిక్కుల్లో పడతారు అందుకే 18 సంవత్సరాల వయసు వచ్చినవాళ్లు కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాలి.

ఎన్నో దశాబ్దాల నుంచి మనకి డ్రైవింగ్ లైసన్సు ఇచ్చే పద్దతి ఒకే విధంగా ఉంటూ వచ్చింది, మనకి దగ్గరలో ఉండే RTO Office కి వెళ్లి క్యూ లైన్లలో నిలబడి డ్రైవింగ్ అప్లికేషన్ (Driving Application) ను ఇవ్వవలసి ఉండేది ఆ తరువాత డ్రైవింగ్ లైసెన్స్ కి సంబందించిన పరీక్ష ను మొదటగా రాయాల్సి వచ్చేది, పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ (Driving Test) ను నిర్వహించే వారు, అది కూడ పాస్ అయిన తరువాతనే మనకి డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చే వారు.

అయితే ఇంక ఇప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ (Central Government) మరియు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్  అండ్ హై వేస్ (Ministry of Road Transport and Highways) తీసుకువచ్చిన కొత్త పద్దతుల వల్ల RTO ఆఫీస్ కి  వెళ్లి ఎలాంటి క్యూ లో నిలబడవలసిన అవసరం లేదు.

Driving License With Out Test: You can get driving license without driving test at RTO office, know how.
image credit : kalinga tv

Also Read : Praja Palana Application Form: తెలంగాణలో ఈ నెల 28 నుంచి జరిగే ప్రజా పాలన సదస్సులో సమర్పించవలసిన దరఖాస్తు లోని పూర్తి వివరాలు మీ కోసం

మీకు దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ (Driving Institute) నుంచి మీ డ్రైవింగ్ సర్టిఫికెట్ ని పొందవచ్చు అవును మీరు విన్నది నిజమే మీరు ఇంకా ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు, మీకు దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ అయినా లేదా ట్రైనింగ్ స్కూల్ (Driving School) లో అయినా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

అయితే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ కొన్ని నిబంధనలు పాటించవలసిందే, టూ వీలర్, త్రీ వీలర్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ సెంటర్ కి కనీసం ఒక ఎకరా భూమి కలిగి ఉండాలి, మీడియం మరియు పెద్ద వాహనాల ట్రైనింగ్ కీ రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి, అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తికి ఐదు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.కనీసం లైసెన్సు అప్లై చేసిన వ్యక్తికి నాలుగు వారాలు పాటు ట్రైనింగ్ తీసుకొని ఉండాలి.

Comments are closed.