Global NCAP reliable crash test results – Mahindra Bolero Neo,c and Kia Carens: 2024 క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ లో రాణించలేకపోయిన మహీంద్రా.

కార్ల యొక్క ఫిట్నెస్ మరియు సేఫ్టీ రేటింగ్ ఇచ్చే గ్లోబల్ NCAP రీసెంట్ గ విడుదల అయిన మహీంద్రా బొలెరో నియో, హోండా అమేజ్‌మరియు కియా కారెన్స్ ల యొక్క క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ ని విడుదల చేసింది, ఆ వివరాలు ఇపుడు చూద్దాం.

Global NCAP: గ్లోబల్ NCAP తన “సేఫర్ కార్స్ ఫర్ ఇండియా” కార్యక్రమంలో భాగంగా మూడు కార్లకు సంబంధించిన క్రాష్ టెస్ట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా బొలెరో నియో, హోండా అమేజ్ మరియు కియా కేరెన్స్‌లు వాటి సేఫ్టీ పెర్ఫార్మన్స్ ని అంచనా వేయడానికి కఠినమైన పరీక్షలను నిర్వహించాయి.

Mahindra Bolero Neo Global NCAP results

మహీంద్రా బొలెరో నియో విషయానికి వస్తే, ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయి. 64 కి.మీ/గం వేగంతో నిర్వహించిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బారియర్(frontal offset barrier) టెస్ట్‌లో ఈ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం తక్కువ వన్-స్టార్ రేటింగ్‌ను పొందింది. టెస్ట్ లో ఆన్ స్టేబుల్ బాడీ షెల్ ఇంటిగ్రిటీ మరియు డ్రైవర్ తలకు తక్కువ రక్షణ మరియు డ్రైవర్ ఛాతీకి బలహీనమైన రక్షణ ఉన్నట్లు వెల్లడైంది. ఫ్రంట్ ప్యాసెంజర్ తల మరియు మెడకు మంచి రక్షణతో కొంచెం మెరుగ్గా ఉన్నాడు కానీ ఛాతీకి కొంచం రక్షణ మాత్రమే ఉంది. డ్రైవర్ మరియు ప్రయాణీకుడు ఇద్దరికీ మోకాలి రక్షణ స్వల్పంగా ఉంది మరియు సైడ్ మొబైల్ బారియర్ టెస్ట్‌లో ఫుట్‌వెల్ ప్రాంతం అస్థిరంగా రేట్ చేయబడింది. 18 నెలల పిల్లలకు చైల్డ్ సీటు తలకు పూర్తి రక్షణను అందించినప్పటికీ, ఫ్రంటల్ ఇంపాక్ట్ సమయంలో తల బహిర్గతం కాకుండా నిరోధించలేకపోయింది.బొలెరో నియోలో సైడ్ లేదా కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు లేవు మరియు దాని చైల్డ్ సేఫ్టీ ఫీచర్లు వెనుక సీట్లకు ISO ఫిక్స్‌ మాత్రం ఏ ఉన్నాయ్.

Honda Amaze Global NCAP results

హోండా అమేజ్‌ యొక్క ఫలితాలు కొంచెం మెరుగ్గా ఉన్నాయి కానీ చెప్పుకునే అంట ఎక్కువ రాలేదు. ఇది అడల్ట్ సేఫ్టీ విషయం లో రెండు-స్టార్ రేటింగ్‌ను మరియు పిల్లల సేఫ్టీ విషయంలో జీరో-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బారియర్ టెస్ట్‌లో, డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల మరియు మెడకు మంచి సేఫ్టీ అందించింది, అయితే ఛాతీ కి తక్కువ రేటింగ్ ఇచ్చింది. మోకాలి రక్షణ అంతంత మాత్రమే, కానీ ఫుట్‌వెల్(footwell) స్థిరంగా ఉంది. సైడ్ మొబైల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో తల మరియు పెల్విస్‌కు(pelvis) మంచి రక్షణ, ఛాతీకి మార్జినల్ సేఫ్టీ మరియు పొత్తికడుపుకు(abdomen) తగిన రక్షణ ఉన్నట్లు తేలింది. అయితే, అమేజ్‌కి సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేదు. రెండు ఏజ్ గ్రూప్స్ కి చైల్డ్ సీట్లు కొంత రక్షణను అందించాయి కానీ కొన్ని ప్రమాదాలను నివారించలేకపోయాయి, ఇది ఫ్రంట్ మరియు సైడ్ టెస్ట్స్ లో జీరో డైనమిక్ స్కోర్‌కు దారితీసింది.

Kia Carens Global NCAP results

చివరగా, Kia Carens మెరుగైన పెర్ఫార్మన్స్ చూపించింది, త్రి స్టార్ రేటింగ్ పొందింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ తల, ఛాతీ, ఉదరం(pelvis) మరియు పొత్తికడుపుకు(abdomen) మంచి రక్షణను చూపించగా, ఫ్రంటల్ ఇంపాక్ట్ ఆన్ స్టేబుల్ బాడీ షెల్ ఇంటిగ్రిటీ ని తెలిపింది. Carens మొదటి మరియు రెండవ వరుసల కోసం స్టాండర్డ్ సీట్ బెల్ట్ రిమైండర్‌లతో వస్తుంది కానీ ముందు వరుసకు మాత్రమే అవసరాలను తీరుస్తుంది. దీని చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ స్కోర్ మెరుగుపడింది, దీనికి ఫోర్-స్టార్ చైల్డ్ ప్రొటెక్షన్ రేటింగ్ వచ్చింది.పూర్తి సేఫ్టీ అందించే ఫ్రంటల్ ఇంపాక్ట్ సమయంలో కేరెన్స్ తల బహిర్గతం(head exposure) కాకుండా నిరోధించగలిగింది.

ముగింపులో, కొన్ని కార్లు సేఫ్టీ ఫీచర్స్ మరియు రేటింగ్‌లలో మెరుగుదలలను చూపించినప్పటికీ, వాటిని ఇంకా పెంచుకునే అవకాశం ఉంది, ప్రత్యేకించి పెద్దలు(adults) మరియు పిల్లలకు మెరుగైన రక్షణను అందించడంలో.

 

Crash test results for the Mahindra Bolero Neo, Honda Amaze, and Kia Carens

Car Model Adult Occupant Protection Child Occupant Protection Comments
Mahindra Bolero Neo One star One star – Low one-star rating for adult occupant protection. – Marginal protection for driver’s head, weak protection for driver’s chest. – Adequate protection for front passenger’s chest. – Limited child safety features (ISO fix for rear outward seats).
Honda Amaze Two stars Zero stars – Two-star rating for adult occupant safety, zero-star rating for child occupant safety. – Good protection for head and neck, adequate protection for chest. – Limited child safety features (lacks side head protection).
Kia Carens Three stars Four stars – Three-star rating. – Good protection for head, chest, abdomen, and pelvis in side impact test. – Unstable body shell integrity in frontal impact. – Improved child occupancy protection score.

 

Global NCAP reliable crash test results

Comments are closed.