Hero MotoCorp : పండుగ సీజన్‌లో హీరో సరికొత్త రికార్డ్, 14 లక్షల యూనిట్లకు పైగా రిటైల్ విక్రయాలు

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ సరికొత్త రికార్డ్ ను సాధించింది. 14 లక్షల ద్విచక్ర వాహనాల యూనిట్లను విక్రయించడం ద్వారా అత్యధిక పండుగల సీజన్ అమ్మకాలను సాధించింది.

Telugu Mirror : హీరో మోటోకార్ప్ లిమిటెడ్ (Hero Moto Crop Limited ) షేర్లు నేడు 2.19 శాతం లాభపడ్డాయి. అంతేకాకుండా, ఈ షేర్లు BSE (Bombay Stock Exchange Limited) లో ఒక్కో షేరుకు ₹3,367 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. షేరు పరిమాణంలో కూడా 1.22 రెట్లు ఎక్కువ పెరిగింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ ₹66,922.22 కోట్లు గా ఉంది. నవంబర్ 17, 2023 నాటికి, స్టాక్ యొక్క 200-రోజుల మూవింగ్ యావరేజ్ (DMA) ₹2912.03 వద్ద ఉండగా , 50-DMA ₹3,098.40 వద్ద ఉంది. BSEలో ప్రస్తుత షేర్ ధర ₹3,348 గా ఉంది. ఇటీవల 50-DMA 200-DMAను దాటింది, ఇది దీర్ఘకాలికంగా బలమైన మరియు స్థిరమైన అప్‌ ట్రెండ్‌ను సూచిస్తుంది.

Also Read : RBI Directs Bajaj Finance : eCOM మరియు Insta EMI కార్డ్ ల మీద రుణాలను ఇవ్వ వద్దని బజాజ్ ఫైనాన్స్ కు RBI ఆదేశం

గతంలో ‘హీరో హోండా’ గా పిలువబడే హీరో మోటోకార్ప్, భారతదేశపు ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటి. జపాన్‌కు చెందిన హోండాతో సాంకేతిక సహకారంతో 1984లో కంపెనీ ప్రారంభించబడింది. మొదట్లో హీరో, హీరో-సైకిల్ బ్రాండ్‌తో సైకిళ్లను విక్రయించడంలో ప్రసిద్ధి చెందింది. 2011లో, హోండా గ్రూప్ కంపెనీలో తన 26% వాటాను ప్రమోటర్లుగా ఉన్న ముంజలాలకు విక్రయించింది. ఫలితంగా, జాయింట్ వెంచర్ ముగిసింది. దీని కారణంగా కంపెనీ పేరును హీరో మోటో కార్ప్‌గా మార్చారు. ఇటీవల, కంపెనీ తన అద్భుతమైన పనితీరుతో 2023 పండుగ సీజన్‌లో మంచి అమ్మకాలను సాధించింది. ఈ సమయం లో అత్యధిక రిటైల్ అమ్మకాలు సాధించబడ్డాయి. 32 రోజుల పండుగ కాలంలో 14 లక్షల (1.4 మిలియన్) యూనిట్లకు పైగా రిటైల్ విక్రయాలను నమోదు చేయడం ద్వారా కంపెనీ రికార్డు సృష్టించింది.

Hero MotoCorp : Hero's new record in festive season, retail sales of over 14 lakh units
Image Credit : The Financial Express

Also Read : Crossbeats Nexus : తక్కువ ధరకే డైనమిక్ ఐలాండ్ తో భారతదేశపు మొట్టమొదటి చాట్ జీపీటీ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాచ్

ఈ ఏడాది 32 రోజుల వ్యవధిలో 14 లక్షల (14 Lakhs) కు పైగా ద్విచక్ర వాహనాల యూనిట్లను విక్రయించడం ద్వారా పండుగ సీజన్‌లో అత్యధిక విక్రయాలను నమోదు చేసినట్లు హీరో మోటోకార్ప్ గురువారం తెలిపింది. దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ నవరాత్రుల మొదటి రోజు మరియు నవంబర్ 15న భాయ్ దూజ్ మధ్య ఈ అమ్మకాల మార్కును సాధించింది. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే 22% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ (Ranjiv Jith Singh) మాట్లాడుతూ, సెంట్రల్, నార్త్, సౌత్ మరియు ఈస్ట్ జోన్‌లలో మంచి వృద్ధితో, మార్కెట్‌ లలో బలమైన కస్టమర్ల కారణంగా రికార్డ్ రిటైల్ సంఖ్యను సాధించామని చెప్పారు. గ్రామీణ మార్కెట్లలో బలమైన కస్టమర్ డిమాండ్, కీలకమైన పట్టణ కేంద్రాలలో చాలా సానుకూల సెంటిమెంట్‌లకు తోడు ఈ రికార్డు రిటైల్ అమ్మకాలను నడిపించిందని ఆయన చెప్పారు.

Comments are closed.