Hero MotoCorp Zoom Series : హీరో నుండి అదిరిపోయే సరికొత్త స్కూటర్.. ఫీచర్స్ ఎక్కువ ధర తక్కువ.

హీరోకి చెందిన బైక్‌లు, స్కూటర్‌లకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. హీరో నుండి కొత్త స్కూటర్ వచ్చింది. ఫీచర్లు, ధర ఏంటో తెలుసుకుందాం.

Hero MotoCorp Zoom Series : దేశంలోనే ప్రముఖ టూ వీలర్ కంపెనీ అయిన హీరో (Hero) సంస్థకు ప్రజలలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కంపెనీ విడుదల చేసిన అనేక మోడళ్లు అమ్మకాలలో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ప్రజలందరి నమ్మకం పొందిన బ్రాండ్ గా కొనసాగుతోంది.

హీరోకి చెందిన బైక్‌లు, స్కూటర్‌లకు మార్కెట్‌లో గిరాకీ ఎక్కువ. ఈ కంపెనీ బైక్‌లు, స్కూటర్లపై వాహనదారుల నుండి మంచి ఆదరణ పొందారు. ఈ క్రమంలో హీరో సంస్థ వినియోగదారులకు శుభవార్త అందించింది.

హీరో కంపెనీ తాజాగా ఓ కొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. హీరో మోటోకార్ప్ జూమ్ సిరీస్‌లో (Hero MotoCorp Zoom Series) తదుపరి విడత జూమ్ కంబాట్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ యొక్క అత్యాధునిక ఫీచర్లు మరియు డిజైన్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

Hero MotoCorp Zoom Series

ఈ స్కూటర్ ZX వెర్షన్ ఆధారంగా రూపొందించారు. కొత్త జూమ్ కంబాట్ ఎడిషన్ ‘మాట్ షాడో గ్రే’కలర్ లో రానున్నట్లు తెలుస్తుంది. ఈరోజు వరకు, ఈ స్కూటర్ ఎల్లో మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉంది. సరికొత్త కంబాట్ ఎడిషన్ కొత్త షాడో గ్రే కలర్‌వేలో వస్తుంది.

ఈ ప్రత్యేకమైన వెర్షన్ గత జూమ్ స్కూటర్‌ల నుండి భిన్నమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,967 నుండి ప్రారంభం కానుంది. ఇది 110.9 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 హార్స్‌పవర్ మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జూమ్ ZX మోడల్ కార్నరింగ్ లైట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది మీ సెల్ ఫోన్‌లో వచ్చిన కాల్‌లు మరియు టెక్స్ట్ మెసేజ్ లను చూసే వీలు ఉంటుంది. జూమ్ స్కూటర్‌లో ‘H’ ఆకారపు లైట్, హెడ్‌లైట్ కోసం ప్రొజెక్టర్, ‘H’ ఆకారపు LED టైల్‌లైట్, ఫ్రంట్ డిస్క్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, USB సెల్ ఫోన్ ఛార్జింగ్ కనెక్టర్ మరియు భారీ స్టోరేజ్ LED లైట్ ఉన్నాయి.

Hero MotoCorp Zoom Series

Comments are closed.