Hyundai Santa Fe New Powerful SUV: హ్యుండయ్ నుంచి త్వరలో ఒక పవర్ ఫుల్ 7 సీటర్ SUV, పూర్తి వివరాలు మీ కోసం

హ్యుండయ్ నుంచి త్వరలో ఒక పవర్ ఫుల్ 7 సీటర్ SUV రాబోతుంది. అద్భుతమైన డిజైన్, విశాలవంతమైన ఇంటీరియర్స్ మరియు సమర్థవంతమైన హైబ్రిడ్ ఇంజన్‌తో, శాంటా ఫే SUVలో స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ ని కలిపి ఇస్తుంది.

Hyundai Santa Fe New Powerful SUV : హ్యుండయ్ నుంచి త్వరలో ఒక పవర్ ఫుల్ 7 సీటర్ SUV.విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందించడానికి హ్యుండయ్ తన SUV సెగ్మెంట్‌లో శాంటా ఫేని తీసుకోని వస్తుంది. అద్భుతమైన డిజైన్, విశాలవంతమైన ఇంటీరియర్స్ మరియు సమర్థవంతమైన హైబ్రిడ్ ఇంజన్‌తో, శాంటా ఫే SUVలో స్టైల్ మరియు పెర్ఫార్మెన్స్ ని కలిపి ఇస్తుంది. ఈ వెహికిల్ కి సంబందించిన మరిన్ని విషయాలు ఇపుడు చూద్దాం.

Exterior Design:
హ్యుందాయ్ శాంటా ఫే తాజా మరియు అద్భుతమైన లైన్‌లతో విప్లవాత్మక డిజైన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో H పాటర్న్ LEDలు మరియు యాక్టివ్ ఎయిర్ వెంట్‌లతో కూడిన బ్లాక్ లాంటి డిజైన్ ఉంది. దీని ప్రొఫైల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ని పోలి ఉంది. బ్లాక్-అవుట్ పిల్లర్లు మరియు ఫ్లోటింగ్ రూఫ్ తో హైలైట్ చేయబడింది. అయితే, భారీ లోగో మరియు వెనుక డిజైన్ అంత అందంగ లేదు అని విశ్లేషకులు చెప్తున్నారు.

Interior and Front Seats:

హ్యుందాయ్ మోడల్స్ అన్నిటితో కంపేర్ చేస్తేయ్ దీన్ని క్యాబిన్ చాల ఆకర్షణీయంగా ఉంటుంది. ఫీచర్స్ , మెటీరియల్‌ క్వాలిటీ, స్టిచ్చింగ్ మరియు డిజైన్‌లు చాల ప్రీమియంగా ఉన్నాయ్. స్టీరింగ్ వీల్ ల్యాండ్ రోవర్ సిరీస్ ని పోలి ఉంటుంది మరియు కర్వ్డ్ డిస్‌ప్లే తో ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది. గ్లోవ్ బాక్స్‌లు, కప్ హోల్డర్‌లు మరియు సెంటర్ కన్సోల్ కింద పెద్ద స్టోరేజ్ స్పేస్ తో చాల స్పేస్ వస్తుంది. సీట్స్ చాల కంఫర్ట్ గ ఉన్నాయ్ అలాగే ఇంటీరియర్ చాల లగ్జరీ ఫీల్ ఇస్తుంది.

Middle-Row Comfort :

వెనుక సీట్స్ లో ప్రయాణీకులకు మంచి వ్యూ మరియు ఎలివేటెడ్ సీటింగ్ పొజిషన్‌ను వస్తుంది. సీట్లు చాల కంఫర్ట్ మరియు మంచి టై సపోర్ట్ ఇస్తాయి. రెండు సన్‌రూఫ్‌లు, స్మార్ట్ USB పోర్ట్‌లు మరియు మాన్యువల్ సన్‌బ్లైండ్‌లు కూడా ఉన్నాయ్.

Boot Space and Seven-Seater:

బూట్ వెడల్పుగా ఉంటుంది మరియు లోడ్ చేయడం సులభం, మరియు సెవెన్-సీటర్ వేరియంట్ మంచి లగేజ్ స్పేస్‌ను ఇస్తుంది.

Engine and Performance:

శాంటా ఫే 1.6 టర్బో హైబ్రిడ్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 180 హార్స్‌పవర్(HP) మరియు 265 (NM) ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ సౌకర్యవంతమైన మరియు సులభమైన డ్రైవింగ్ ఫీల్ ని అందిస్తుంది. వెయిట్ డిస్ట్రిబూతుకిన్ అండ్ బ్యాలెన్సింగ్ కూడా చాల పర్ఫెక్ట్ గ ఉంటుంది. హైబ్రిడ్ సిస్టమ్ ఓవర్ టేక్ చేసేటప్పుడు మంచి పవర్ ని ఇస్తుంది కానీ కావాల్సిన పికప్ వెంటనే రావట్లేదు అని నిపుణులు చెప్తున్నారు.

Handling:

శాంటా ఫే ఆఫ్-రోడ్ డ్డ్రైవింగ్ కంటే నార్మల్ డ్రైవింగ్ కు బాగా సెట్ అవుతుంది. సస్పెన్షన్ చాల సాఫ్ట్ మరియు స్మూత్ గ ఉంది. చాలా రహదారులు పై మృదువుగా మరియు సౌకర్యవంతమైన రైడింగ్ ఫీల్ అందిస్తుంది.

Braking Performance:

బ్రేకింగ్ కొంచం రఫ్ గ ఉంది దాన్ని ఇంకా కొంచం స్మూత్ గ డెవలప్ చేయాలి అంటున్నారు. శాంటా ఫే ఒక సౌకర్యవంతమైన SUV, లగ్జరీ, సామర్థ్యం మరియు ప్రత్యేక గుర్తింపును అందిస్తుంది. దీనికి స్పోర్టినెస్ లేకపోవడం మరియు మరింత పెర్ఫార్మన్స్ అవసరం అయినప్పటికీ, ఇది టయోటా ఫార్చ్యూనర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది అని భావిస్తున్నారు . విలాసవంతమైన మరియు చక్కగా డిజైన్ చేయబడిన SUVని కోరుకునే వాళ్లకి ఇది చక్కని ఎంపిక. ధర 50 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Specifications Details
Engine 1.6 Turbo Hybrid
Horsepower 180 HP
Torque 265 Nm
Drive Type Front-wheel drive
Transmission Automatic
Exterior Design Revolutionary with fresh details
Front Design Block like with H pattern LEDs
Profile Land Rover Defender vibes
Rear Design Van-like treatment, oversized logo
Interior Luxurious and well-built
Steering Wheel Resembles a Land Rover unit
Display Curved modern
Materials Wood leather, chrome
Features Smart use of materials, ample storage
Seats Plush and comfortable
Middle-row Comfort Elevated seating, good thigh support
Sunroofs Two, split by center bar
Boot Space Wide and easy to load
 

hybrid System

Provides electric boost for easy take-off
Performance Comfortable and easygoing
Handling Requires some steering input
Ride Comfort Supple and comfortable
Braking Performance Could use improvement
Price Expected upwards of 50 lakh

Hyundai Santa Fe New Powerful SUV

Also Read:Tata Tiago EV Range Test and Long Term Review: Tata Tiago EV యొక్క రేంజ్ మరియు దాని యొక్క డైరెక్ట్ ఓనర్స్ రివ్యూ మీ కోసం.

Comments are closed.