Tata Altroz Racer : టాటా నుండి మరో కొత్త నయా కారు, ఫీచర్స్ చూస్తే అదుర్స్

భారతదేశంలో ఆల్టోజ్ రేసర్‌ను త్వరలో విడుదల కానుంది. టాటా ఆల్టోజ్ రేసర్ దాని స్పోర్టీ కారుకి అనుగుణంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే..

Tata Altroz Racer : టాటా మోటార్స్ భారతదేశంలో ఆల్టోజ్ రేసర్‌ను త్వరలో విడుదల చేయనుంది. టాటా కార్ ప్రియులు గత కొన్ని రోజులుగా ఈ వాహనం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారును తాజాగా, 2024 భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. టాటా ఆల్ట్రోజ్ రేసర్ అనేది ఇప్పటికే భారతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్న టాటా ఆల్ట్రోజ్ వెర్షన్‌కు రేసర్ అనేది స్పోర్టియర్ వెర్షన్‌గా పేర్కొన్నారు.

అయితే, ఈ కారు విడుదలైతే మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. Tata Altrozకి ఎలాంటి అప్‌డేట్‌లు రాలేదు. అయితే, ఈ నేపథ్యంలో కొత్త ఆల్ట్రోజ్ రేసర్ స్పోర్టీ వేరియంట్‌లో రిలీజ్ చేయనున్నారు.

టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఆకట్టుకునే పవర్‌ప్లాంట్‌ను కలిగి ఉంది. ఇంకా, ఈ కారు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో కూడా రానుంది. ఈ ఇంజన్ 118బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ హ్యుందాయ్ ఐ20 ఎన్ సిరీస్‌తో పోల్చవచ్చు. అంతే కాకుండా, ఈ ఇంజన్ మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Tata Altroz Racer

టాటా ఆల్టోజ్ రేసర్ దాని స్పోర్టీ కారుకి అనుగుణంగా ఉంటుంది. కారు రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఫెండర్‌లపై ‘రేసర్’బ్యాడ్జ్ తో వస్తుంది. ఈ డిజైన్ గత మోడల్ పరిచయంలో ప్రదర్శించారు. కారు లోపలి భాగంలో డ్యాష్‌బోర్డ్‌లో కాంట్రాస్ట్ స్టిచింగ్ మరియు కలర్ యాక్సెంట్‌లతో కూడిన లెథెరెట్ అప్హోల్స్టరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కారు స్పోర్టీ అనుభూతిని మెరుగుపరచడానికి ఈ మెరుగుదలలు చేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

టాటా ఆల్ట్రోజ్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు వాయిస్-కమాండ్ సన్‌రూఫ్ ఉన్నాయి. ఆటోమొబైల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ,ESC స్టాండర్డ్ ఫీచర్లతో వస్తుంది. భవిష్యత్ లో ఈ కారు స్టాండర్డ్ వేరియంట్లో కనిపించే అవకాశం ఉంది.

Tata Altroz Racer

Comments are closed.