ICICI Credit Card Charges : క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్.. జూలై 1 నుండి చార్జెస్ లేవు.

ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైనఈ ఐసీఐసీఐ బ్యాంక్ అనేక క్రెడిట్ కార్డ్ చార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే..

ICICI Credit Card Charges : ఈరోజుల్లో, చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ప్రధాన బ్యాంకులతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు కూడా క్రెడిట్ కార్డులను అందిస్తాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగించి కూడా లోన్స్ పొందవచ్చు. మళ్ళీ వాటిని వాయిదాలలో చెల్లించుకోవచ్చు.

నేటి కాలంలో, ఉద్యోగంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డును కలిగి ఉంటున్నారు. ఎస్‌బిఐ కార్డ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI Bank) మరియు యాక్సిస్ బ్యాంక్ అధిక సంఖ్యలో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేస్తాయి. ఈ కార్డ్‌లలో కొన్ని కార్డులకు ఎక్కువ వినియోగదారులు ఉంటారు.

అయితే, ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైనఈ ఐసీఐసీఐ బ్యాంక్ అనేక క్రెడిట్ కార్డ్ చార్జీలను మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. దీని గురించి బ్యాంక్ ఇప్పటికే తన ఖాతాదారులకు ఇమెయిల్‌లను జారీ చేసింది. దీంతో బ్యాంకు క్రెడిట్ కార్డులు వినియోగించే వారికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

ICICI బ్యాంక్ ప్రకారం, పెరిగిన క్రెడిట్ కార్డ్ ఛార్జీలు జూలై 1 నుండి అమలులోకి వస్తాయి. గతంలో, ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్ రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ICICI Credit Card Charges

అదే ఇప్పుడు ప్రతి స్లిప్‌కు రూ. 100 కట్టాల్సి ఉండగా..ఈ రుసుములను మాఫీ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, చెక్కు లేదా క్యాష్ పికప్ ఫీజు విషయానికి వస్తే, ఇప్పటి వరకు చార్జీలు పికప్‌కి రూ.100 చొప్పున పడేవి. అయితే, ఇకపై ఈ ఛార్జీతో తో ఎలాంటి ఇబ్బంది లేదు.

అదనంగా, డయల్-ఎ-డ్రాఫ్ట్ లావాదేవీ ఖర్చు ఉంది. డ్రాఫ్ట్ విలువ మొత్తంలో 3 శాతం, కనీస ఛార్జీ రూ. 300. అయితే, ఈ ఛార్జీలు ఇకపై ఉండవు. ఇది క్లయింట్ సంతృప్తిని మెరుగుపరుస్తుంది. అవుట్‌స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే, ఇప్పటి వరకు, చెక్కు విలువలో ఒక శాతం ఛార్జ్ పడేది. లేకుంటే కనీస ఛార్జ్ రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ ఛార్జీలతో ఎలాంటి పని లేదు. చార్జెస్ చెల్లించాల్సిన అవసరం లేదు.

ICICI బ్యాంక్ డూప్లికేట్ స్టేట్‌మెంట్ రిక్యూస్ట్ మరియు కార్డ్ రీప్లేస్‌మెంట్‌ల (Card Replacement) కోసం ఛార్జీలను తగ్గించింది, తగ్గిన రుసుము కార్డుకు రూ. 200 పడుతుంది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలు రూ.3500 వరకు ఉండవచ్చు. కాబట్టి, మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తుంటే, ఈ మార్పులను గమనించండి.

ICICI Credit Card Charges

Comments are closed.