PF With Draw: పీఎఫ్ విత్ డ్రా కి సమయం పడుతుందా, ఇకపై 2 నిమిషాలు చాలు, డబ్బుని విత్ డ్రా చేసుకోండిలా.

పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారా, అయితే ఈ విధంగా చేస్తే రెండు నిమిషాల్లోనే మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

PF With Draw: పదవీ విరమణ తర్వాత, ఒక ఉద్యోగి లేదా కార్మికుడు PF డబ్బు మరియు పెన్షన్ అందుకుంటారు. ఉద్యోగి అనుకోకుండా మరణిస్తే ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బు కుటుంబానికి భద్రత కల్పిస్తుంది. నామినీ యొక్క EPF ఖాతా నుండి డబ్బు విత్ డ్రా చేయొచ్చు. అయితే, ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ప్రావిడెంట్ ఫండ్ (PF) నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ EPF ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ లేదా నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం మీకు ఉంది. ఉద్యోగి పరిస్థితులను బట్టి మొత్తం లేదా పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేయవచ్చు.

మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ PF ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, మీరు నిర్దిష్ట షరతులలో మాత్రమే చేయవచ్చు.
అవి, విద్యకు, వైద్యానికి. పెళ్లి చేసుకోవడానికి, భూమిని కొనుగోలు చేయడానికి లేదా ఇల్లు కట్టుకోవడానికి, గృహ రుణం పొందేందుకు మరియు ఇంటిని పునర్మించుకోవడానికి విత్ డ్రా చేసుకోవచ్చు.

EPF కడుతున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి ఒక నెలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే అప్పటి వరకు జమ చేసిన మొత్తంలో 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు నెలలు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా 25% కూడా వెనక్కు తీసుకోవచ్చు. ఇవే కాదు, ఉద్యోగ విరమణకు ముందు పీఎఫ్‌ కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి లభిస్తుంది.

ఆన్‌లైన్ విత్‌డ్రా ఎలా చేసుకోవాలి ?

EPF అకౌంట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే తొలుత యూఏఎన్ నంబర్ (UAN Number) ఉండాలి. దీనిని ఆన్‌లైన్‌ (Online) లో యాక్టివ్ చేసుకోవాలి. కేవైసీ (KYC) పూర్తి చేసి ఉండాలి. ఇ- నామినేషన్ (E-Nomination) , మొబైల్ నంబర్ అప్డేట్‌లో ఉండాలి. ఇవన్నీ అయితేనే పీఎఫ్ విత్‌డ్రా (PF With Draw) చేసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్ఓ (EPFO) మెంబర్స్ పోర్టల్‌ను ఆశ్రయించొచ్చు.

-EPFO e-SEWA పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

– ఆన్‌లైన్ క్లెయిమ్‌ (Online) ల విభాగానికి వెళ్లండి.

-బ్యాంక్ అకౌంట్‌ వివరాలను నమోదు చేయాలి

-టర్మ్స్‌ & కండిషన్స్‌ (Terms & Conditions) బాక్స్‌లో టిక్‌ చేయండి

– డబ్బు విత్‌డ్రా (Money With Draw) చేస్తున్న కారణాన్ని ఎంచుకోండి

-అక్కడ అడిగిన వివరాలు ఎంటర్‌ చేసి, తగిన ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయండి

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌(Register Mobile Number) కు వచ్చిన OTPని ఎంటర్‌ చేసి సబ్మిట్‌ నొక్కండి.

-కేవలం 2 నిమిషాల్లోనే ఈ పని పూర్తవుతుంది. EPFO అధికార్లు మీ అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేసి, మీ బ్యాంక్‌ అకౌంట్‌లోకి డబ్బు జమ చేస్తారు.

PF With Draw

Comments are closed.