Beauty Tips : మొటిమలు, మచ్చలతో నలుగురిలో కలవలేక పోతున్నారా? అయితే ఇది మీకోసమే

చాలామందికి ముఖంపై మొటిమలు మరియు వాటి తాలూకు మచ్చలు ముఖ్యంగా ఈ సమస్య టీనేజ్ లో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటాయి. మార్కెట్ లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినప్పటికీ కొంతమందికి అవి సరిపడక సమస్య మరింత కఠినతరం అవుతుంది. అటువంటి వారికోసం కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి ఈ రోజు కధనంలో తెలుసుకుందాం.

చాలామందికి ముఖంపై మొటిమలు (pimples) మరియు వాటి తాలూకు మచ్చలు వస్తుంటాయి. మార్కెట్ లో ముఖ్యంగా ఈ సమస్య టీనేజ్ లో ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటాయి. మార్కెట్ లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ వాడినప్పటికీ తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.

మరి కొంతమందికి అవి సరిపడక సమస్య మరింత కఠినతరం అవుతుంది. ఎందుకంటే మార్కెట్లో కొన్న బ్యూటీ ప్రొడక్ట్స్ లో రసాయనాలు ఉంటాయి కాబట్టి.

అందుకే ఈరోజు కథనంలో సహజ పదార్థాలని ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకుని వాడే రెండు రకాల ఫేస్ ప్యాక్ లను తెలియజేస్తున్నాం.

ఈ ఫేస్ ప్యాక్ లను వాడటం వలన ముఖంపై ఉన్న మొటిమలు మరియు మచ్చలను (Spots) సులభంగా తొలగించుకోవచ్చు. మొటిమలు మరియు మచ్చలు నివారణకు ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం.

Also Read : White Discharge Problem : ఈ చిట్కాతో మహిళలు ఇప్పుడు నలుగురిలో సంతోషంగా ఉండగలరు. వైట్ డిశ్చార్జ్ కి హోమ్ రెమిడీ

Beauty Tips : Are you unable to get along with acne and scars? But this is for you
Image Credit : YT/ Beauty Recipes

 మొదటి ఫేస్ ప్యాక్  :

రెండు స్పూన్ల శనగపిండిలో, రెండు స్పూన్ల గంధం పొడి (Sandalwood powder), రెండు స్పూన్ల పాలపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూన్ కస్తూరి పసుపు, అర స్పూన్ తేనె. ఈ పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. స్క్రబ్ ఫేస్ ప్యాక్ సిద్ధమైంది. ఈ ఫేస్ ప్యాక్ ని ముఖం పై అప్లై చేసి 20 నిమిషాలు పాటు నెమ్మదిగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ను మెడ, కాళ్లు మరియు చేతులకు కూడా అప్లై చేయవచ్చు. స్క్రబ్ చేసిన తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమలు మరియు మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది.

రెండవ ఫేస్ ప్యాక్ :

ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆర్గానిక్ పసుపు, కొద్దిగా బాదం నూనె. వీటిని ఒక గిన్నెలో వేసి కలపాలి. ఆ తర్వాత పచ్చిపాలు పోసి కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి ఆరిన తర్వాత సాధారణ నీటితో సున్నితంగా మర్దన చేస్తూ కడగాలి.

Also Read : Face Pack : 20 ఏళ్ళకే 40 లా కనిపిస్తున్నారా? అందుకు కారణమైన ముడతలను ఇలా తగ్గించి మరలా 20 కి వచ్చేయండి

ఈ ప్యాక్ లను ఉపయోగించిన తర్వాత కనీసం ఐదు గంటల వరకు ఎటువంటి సోప్ లేదా ఫేస్ వాష్ ను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఫేస్ ప్యాక్ వల్ల వచ్చే ప్రయోజనాలు ముఖానికి లభించవు.

కాబట్టి ముఖంపై మొటిమలు వాటి తాలూకు మచ్చల తో ఇబ్బంది పడేవారు ఈ రెండు ఫేస్ ప్యాక్ లను ఉపయోగించడం వలన మీకున్న సమస్య (problem) నుండి బయటపడవచ్చు. అలాగే మొటిమలు మరియు మచ్చలు లేని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

Comments are closed.