కొబ్బరి నూనెతో తప్పక తెలుసుకోవాల్సిన 5 బ్యూటీ టిప్స్

కొబ్బరినూనెతో ఇంట్లోనే తయారు చేసుకొనే కొన్ని బ్యూటీ టిప్స్ గురించి ఒకసారి చూద్దాం.

Telugu Mirror : ప్రకృతి అందించే ఎన్నో బహుమతులను మనం అంతగా పట్టించుకోము. కానీ అవి మనకు ఎటువంటి హాని కలుగకుండా మేలుని కలిగిస్తాయని తెలుసు. ప్రకృతి మనకి ఇచ్చే కానుకలో కొబ్బరి ఒకటి. కొబ్బరి నూనె (Coconut Oil) మనకి అందాన్నిపెంచడంతోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి  మరియు జుట్టుకి పోషణ ఇస్తాయి. మీ అందాన్ని పెంచుకునేందుకు కొబ్బరి నూనెను ఎలా వాడాలో తెలుసుకుందాం. కొబ్బరి నూనె తో ఇంట్లో తయారు చేసుకొనే కొన్ని బ్యూటీ టిప్స్ ఉన్నాయి వాటిని ఒకసారి చూద్దాం. ఈ సులభమైన మరియు సురక్షితమైన బ్యూటీ టిప్స్  గురించి తెలుసుకుందాం.

Makeup Remover :

Best beauty-hacks-with-coconut-oil
Image Credit : TV9 Telugu

కొబ్బరినూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ లక్షణాలు, కెమికల్స్ తో  కూడిన మేకప్  ని సులభంగా తొలగిస్తుంది. ఎటువంటి చిరాకు, దురద లేకుండా మీ మేకప్ ఈజీ గా రిమూవ్ చేయవచ్చు మరియు ఇది మీ చర్మాన్ని తాజాగా మరియు తేమను అందించేలా చేస్తుంది. మీ చర్మం మెరుపుని మెరుగుపరుస్తుంది .

Body Scrub :

Best beauty-hacks-with-coconut-oil
Image Credit : Boldsky Telugu

మీ చర్మాన్ని ఎక్సప్లోయిట్ (Exploit) చేయడం వల్ల డెడ్ సెల్స్ అన్ని తొలగిపోయి మీ చర్మం నిగారింపుని పొందుతుంది. కొబ్బరి నూనెతో స్క్రబ్బర్ ని ఎలా తయారు చేసుకోవాలంటే, కొబ్బరి నూనెలో చెక్కరను కలిపి మీ చర్మాన్నీ స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మెరుస్తూ ఉండడంతో పాటు తేమగా ఉంటుంది.

Oral Care :

5-must-know-beauty-hacks-with-coconut-oil
Image Credit : Samayam Telugu

మన నోటి సంరక్షణ కొరకు కొబ్బరి నూనె మంచి ఔషధం లా పని చేస్తుంది. కొబ్బరి నూనె తో ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు. మీ దంతాలను శుభ్రం చేసుకున్న తర్వాత నోట్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని 15-20 నిమిషాల వరకు పుక్కిలించాలి. ఇలా చేయడం  వల్ల మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఎక్కువ కాలం తెల్లగా ఉంటాయి.

Shaving Cream :

Best beauty-hacks-with-coconut-oil
Image Credit : Wiki How

కొబ్బరి నూనెను షేవింగ్ చేసుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు. చర్మాన్నిశుభ్రపరచే ప్రాంతంలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల రేజర్ ఈజీ గా మూవ్ అవుతుంది  మరియు చర్మం ఏదైనా డ్యామేజ్ కి గురైతే తొందరగా నయం చేస్తుంది.

Make-Up Brush Cleaner :

Best beauty-hacks-with-coconut-oil
Image Credit : Freepik

మీరు మేకప్ ని రిమూవ్ చేసుకోవడానికి మాత్రమే కాదు మేకప్ బ్రష్ ని కూడా శుభ్రం చేసేందుకు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మేకప్ బ్రష్ లో బాక్టీరియా చేరకుండా ఉండేలా చేస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని ఆ మేకప్ బ్రష్ లో వేస్తే చాలు.

Comments are closed.