Bleach Face Pack : పార్లర్ లో బ్లీచ్ మీకు సరిపడలేదా? ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి, తక్షణమే గ్లోయింగ్ స్కిన్ పొందండి

స్త్రీలు తక్షణ గ్లోయింగ్ స్కిన్ పొందడం కోసం బ్లీచ్ ఉపయోగిస్తుంటారు. కానీ అది ప్రతికూల ప్రభావం చూపించినట్లైతే దానివల్ల ముఖానికి చాలా హాని కలుగుతుంది. మార్కెట్లో లభించే బ్లీచ్ వాడటం మీకు ఇష్టం లేకపోతే, ఈరోజు కథనంలో ఇంట్లోనే బ్లీచ్ కి సంబంధించిన కొన్ని ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేయాలో, మరియు వాటిని ఎలా వాడాలో తెలియజేస్తున్నాం.

ప్రతి ఒక్కరూ తమ చర్మం (skin) అందంగా ఎల్లప్పుడూ మెరుస్తూ ఉండాలని కోరుకోవడం సహజం. సీజన్ మారుతూ ఉంటుంది. కాబట్టి సీజన్ కు తగిన విధంగా చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. స్త్రీలు తక్షణ గ్లోయింగ్ స్కిన్ పొందడం కోసం బ్లీచ్ ఉపయోగిస్తుంటారు.

పార్లర్ కి వెళ్లి బ్లీచ్ చేయించడం చాలా సులభం. అయితే పార్లర్ లో చేసే బ్లీచ్ అందరికీ సరిపోదు‌ ఒకవేళ బ్లీచ్ చర్మానికి సరిపోతే దాని యొక్క ఉపయోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అది ప్రతికూల ప్రభావం (Adverse effect) చూపించినట్లైతే దానివల్ల ముఖానికి చాలా హాని కలుగుతుంది.

మార్కెట్లో లభించే బ్లీచ్ వాడటం మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఉపయోగించడం ద్వారా తక్షణమే గ్లోయింగ్ స్కిన్ ను పొందవచ్చు.

ఈరోజు కథనంలో ఇంట్లోనే బ్లీచ్ కి సంబంధించిన కొన్ని ఫేస్ ప్యాక్ లను ఎలా తయారు చేయాలో, మరియు వాటిని ఎలా వాడాలో తెలియజేస్తున్నాం.

వీటి వల్ల ముఖంపై ఎటువంటి చెడు ప్రభావం (bad influence) ఉండదు. ప్రతి ఒక్కరు భయపడకుండా ఈ ప్యాక్ లను ఉపయోగించవచ్చు.

ఓట్స్ :

Bleach Face Pack : Can't get enough of the bleach at the parlor? Make this at home and get glowing skin instantly
Image credit : Bold Sky

 

రెండు స్పూన్ల ఓట్స్ పౌడర్ లో పెరుగు మరియు నిమ్మరసం కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖంపై 20 నిమిషాలపాటు అప్లై చేయాలి. అప్పుడే దీని ప్రయోజనం (effect) చర్మానికి లభిస్తుంది. ఈ ప్యాక్ ముఖం మీద ఉండే అన్ని రకాల సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.

Also Read : Fenugreek Seeds Benefits : మెంతుల ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వాడండి తేడా చూడండి

నిమ్మరసం మరియు తేనె :

Bleach Face Pack : Can't get enough of the bleach at the parlor? Make this at home and get glowing skin instantly
Image Credit : Quora

రెండు స్పూన్ల తేనె లో మూడు నుంచి నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ప్యాక్ సిద్ధమైంది. ఈ ప్యాక్ రసాయనాలు (Chemicals) లేని బ్లీచ్ లా చాలా బాగా పనిచేస్తుంది.

నిమ్మరసం మరియు ఎర్ర కందిపప్పు :

Bleach Face Pack : Can't get enough of the bleach at the parlor? Make this at home and get glowing skin instantly
Image Credit : Dana-Farber Cancer Institute

ఎర్ర కందిపప్పు (Red lentils) ను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే దీనిని మెత్తటి పేస్టులా గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ లో, నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ని వారంలో రెండు సార్లు ఉపయోగించడం వల్ల చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

బొప్పాయి మరియు నిమ్మరసం :

Bleach Face Pack : Can't get enough of the bleach at the parlor? Make this at home and get glowing skin instantly
Image credit : Only My Health

బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ కి, నిమ్మరసం కలపాలి. ఈ ప్యాక్ ను ముఖం పై అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ వల్ల ఖచ్చితంగా (accurately) ప్రయోజనం కలుగుతుంది.

Also Read : Benefits Of Rose Water : రోజ్ వాటర్ ని ఇలా ఉపయోగిస్తే గులాబీ లాంటి అందం మీ స్వంతం

ఆరెంజ్ తొక్క :

Bleach Face Pack : Can't get enough of the bleach at the parlor? Make this at home and get glowing skin instantly
Image Credit : Beauty,
Fashion Lifestyle blog

ఆరెంజ్ తొక్కలో ఉండే సమ్మేళనాలు వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి. దీనికోసం నారింజ తొక్క (orange peel) ను ఎండబెట్టి, పొడి చేయాలి. ఈ పొడిలో తేనె మరియు పాలు కలపాలి. ఈ ప్యాక్ ను వారంలో రెండుసార్లు వాడటం వల్ల చాలా బాగా పనిచేస్తుంది.

కాబట్టి పార్లర్ కి వెళ్లలేని వారు, అలాగే మార్కెట్లో లభించే బ్లీచ్ ప్రొడక్ట్స్ వాడటం ఇష్టం లేనివారు, ఇంట్లోనే ఇటువంటి బ్లీచ్ కి సంబంధించిన ప్యాక్ లను తయారు చేసుకొని వాడినట్లయితే తక్షణమే (Instantly) గ్లోయింగ్ స్కిన్ ను సొంతం చేసుకోవచ్చు.

ఈ ప్యాక్ లు వాడటం వల్ల ముఖం గులాబీ పువ్వులా వికసించడం (to bloom) లో సందేహమే లేదు. ఎందుకనగా ఈ ప్యాక్ లు అంత బాగా పనిచేస్తాయి.

Comments are closed.