Bye Bye Hair Dye : హెయిర్ డై కి టాటా చెప్పండి, సహజ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లబరచండి

వయస్సుతో సంభంధం లేకుండా తెల్ల జుట్టు సమస్యతో ఎంతో మంది బాధపడుతుంటారు, దీనికి పరిష్కారంగా హెయిర్ డై ని వాడుతుంటారు. ఎన్నో కెమికల్స్ కలిసి ఉండే హెయిర్ డై వలన పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలకు చెక్ పెట్టేలా వంటింట్లో లభించే పదార్ధాలను వాడి జుట్టును నల్లబరచుకోవచ్చు.

ప్రతి ఒక్కరూ తమ జట్టు నల్లగా (Black) మరియు దృఢంగా, అందంగా ఉండాలని కోరుకోవడం సహజం‌. అయితే ఈ మధ్యకాలంలో వయస్సు (Age) తో సంబంధం లేకుండా అందరినీ తెల్ల జుట్టు (White Hair) బాధిస్తుంది. తమ జుట్టు నల్లబరచుకోవడానికి కొంతమంది హెయిర్ డై (Hair dye) ను వాడుతుంటారు. ఈ విధంగా చేయడం వల్ల కొన్ని రోజుల వరకు జుట్టు నల్లగా ఉంటుంది. కానీ అధికంగా వాడటం వల్ల కాలం గడిచే కొద్దీ తెల్ల జుట్టు అధికమవడంతో పాటు చుండ్రు (Dandruff) సమస్య మరియు దురద (Itching) వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు హెయిర్ డై వాడకుండా సహజ పద్ధతిలోనే తెల్ల జుట్టును నల్లబరుచుకోవచ్చు.

మన వంట గదిలో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి నల్లని కేశాలను సొంతం చేసుకోవచ్చు. దీని కోసం ఏయే పదార్థాలు కావాలో మరియు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

టీ పొడి లేదా కాఫీ పొడి:

వీటిని ఉపయోగించి కూడా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు నీళ్లు తీసుకుని దానిలో ఒక స్పూన్ టీ పొడి (Tea powder) లేదా కాఫీ పొడి (Coffee powder) వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక వడగట్టి ఆ నీటిని జుట్టు కి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. తరచుగా ఈ విధంగా చేయడం వల్ల జుట్టు నల్లబడే అవకాశం ఉంటుంది.

Also Read :Basil Benefits : జుట్టు సమస్యలకు తులసితో చెక్ పెట్టండిలా

కెరాటిన్ ట్రీట్మెంట్ తో మెరిసే జుట్టు మీ సొంతం, డబ్బు మితం పోషణ అమితం.

కరివేపాకు:

ఆరోగ్యాన్ని కాపాడే కరివేపాకు (Curry leaves) జుట్టును కూడా నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనె (Coconut oil) లో, కరివేపాకు ఆకులను వేసి సన్నని మంట మీద వేడి చేయాలి. ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ ను వడకట్టి ఒక గాజు సీసా (Glaas jar) లో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే చాలు‌. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు నల్లగా మారే అవకాశం ఉంటుంది.

Bye Bye Hair Dye : Say goodbye to hair dye, turn white hair black with natural tips
image credit : Guilty Bytes

ఉసిరికాయ:

జుట్టు పోషణకు ఉసిరికాయ (Indian Gooseberry) కు మొదటి స్థానం ఉంది. ఇది జుట్టును నల్లగా చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం ఉసిరికాయలను ముక్కలుగా కట్ (Cut) చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు నల్లబడడం మొదలవుతుంది.

నల్ల జీలకర్ర:

నల్ల జీలకర్ర ని కలోంజి గింజలని కూడా పిలుస్తారు. ఇవి సహజంగానే జుట్టును నల్లగా మార్చేందుకు చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం కొబ్బరి నూనెలో కలోంజి గింజలు (Kalonji seeds) వేసి కలపాలి. మరియు దానిలో కరివేపాకు ఆకులను కూడా వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. ఆయిల్ సిద్ధమైంది. ఈ నూనెను రాత్రి పూట తలకు రాసి ఉదయాన్నే మైల్డ్ షాంపూ (Mild shampoo) తో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Bye Bye Hair Dye : Say goodbye to hair dye, turn white hair black with natural tips
image credit : Net meds

ఉల్లిపాయ:

ఉల్లిపాయ ఆరోగ్యానికే కాదు జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉల్లిపాయలో విటమిన్- C, విటమిన్- E, సల్ఫర్ (Sulphur) మరియు యాంటీ ఆక్సిడెంట్స్ (Anti oxidants) ఉండటం వల్ల ఇది చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గించడంతోపాటు జుట్టుని నల్లగా కూడా చేస్తుంది.
దీనికోసం ఉల్లిపాయ (Onion) మీద ఉన్న పొట్టును తొలగించి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేసి, రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. దీనిని తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కాబట్టి తెల్ల జుట్టు ఉన్నవారు రసాయనాల (Chemical) తో కూడుకున్న హెయిర్ డై (Hair dye) ను వాడకుండా, ఇటువంటి ఇంటి చిట్కాలను పాటించి తమ జుట్టును సహజ పద్ధతిలో నల్లగా మార్చుకోవచ్చు.

Comments are closed.