హెచ్చు తగ్గుల ధరలోనే కాదు ప్రయోజనాలు కూడా అధికమే. లాభ నష్టాల టమాటా జ్యూస్

టమాటా రసం వాడకం వలన శరీరానికి ఆరోగ్యకరమైన ఉపయోగాలను కలిగిస్తుంది. అదే సమయంలో కొన్ని నష్టాలు లు కూడా టమాటా రసం కలిగిస్తుంది. బరువు నియంత్రణకు, క్యాన్సర్ కణాల నిరోధానికి ఉపయోగకారిగా టమాటా రసం పనిచేస్తుంది.

టమాట (Tomato) తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. టమాటో తో పాటు టమాటో రసం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్ (Anti oxidants) లక్షణాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల (Cholesterol) ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు (Blood Pressure) ని నియంత్రిస్తుంది. అలాగే రక్తంలో, చక్కెర స్థాయి (Sugar level) ని తగ్గించడంలో దోహదపడుతుంది. టమాట రసం బరువు ను నియంత్రణలో ఉంచుటకు కూడా తోడ్పడుతుంది. క్యాన్సర్ (Cancer) కణాల పెరుగుదలను నిరోధించడం లో కూడా చాలా బాగా దోహదపడుతుంది.

టమాట రసం తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాలలో వాటి రసం చెడు ప్రభావాలు కలిగిస్తుందని అధ్యయనాల్లో పేర్కొన్నారు.

Not only the price of ups and downs but also the benefits are high. Tomato juice of profit and loss
image credit : Only My Health

టమాట రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో పొటాషియం (Potassium) స్థాయిని పెంచుతుంది. ఇది ప్రమాదకరమైన సమస్యలకు దారితీస్తుంది. టమాటో రసం తీసుకోవడం వల్ల నోటి ఎలర్జీ సిండ్రోమ్ కు కారణం అయ్యే అవకాశం ఉంది.

టమాట రసం తాగడం వల్ల కొన్నిసార్లు నోరు (Mouth), ముక్కు (Nose), శ్లేష్మ పొర వాపు, కళ్ళ (Eye’s) కు వాపు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ (Kidney) సమస్యలు ఉన్నవారు టమాటా రసం తీసుకోవడం తగ్గించాలి. ఇది కఠినమైన హైపరకలేమియా (Hyperkalemia) కు దారితీస్తుంది. టమాటా అలర్జీ (Allergy) ఉన్నవారు, టమాటా రసం త్రాగడం మానేయాలి. టమాట రసం గర్భిణీ (Pregnant) స్త్రీలకు, పాలు ఇచ్చే తల్లుల (Feeding mother) కు అంత సురక్షితమైనదని కూడా చెప్పలేము .

Also Read : అత్తిపండుతో అధిక బరువు హాం ఫట్..అంజీర్ చేసే లాభాలు ఇంకా మరెన్నో

Digestive System : ఈ పండ్లను తీసుకోండి జీర్ణ సమస్యలకు ఇక సెలవు పెట్టండి

కాబట్టి టమాట రసం తీసుకునే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. అలాగే టమాట రసం చిన్న పిల్లల (Children) కు, వృద్ధుల (old people) కు ఇవ్వాలి అనుకుంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇవ్వాలి.
ఎందుకనగా వారిలో రోగనిరోధక శక్తి (Immunity power) బలహీనంగా ఉంటుంది. కాబట్టి టమటా రసం వారి శరీరంలో ఎలర్జీని కూడా కలిగించే అవకాశం ఉంటుంది.

కాబట్టి టమాటో రసం తీసుకోవడం ఆరోగ్యాని (Health) కి మంచిదే కానీ, కొన్ని సందర్భాలలో ఇటువంటి దుష్ప్రభావాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువలన టమాటో అంటే ఎలర్జీ ఉన్నవారు మరియు పిల్లలు, వృద్దులు వీరు తప్పకుండా వైద్యుడు (Doctor) ని సంప్రదించి వారి సలహాను పాటించాలి.

Comments are closed.