Digestive System : ఈ పండ్లను తీసుకోండి జీర్ణ సమస్యలకు ఇక సెలవు పెట్టండి

మారుతున్న జీవన శైలి వలన ప్రతి ఒక్కరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి సులభంగా బయట పడేందుకు ఆహారంలో ఈ నాలుగు పండ్లను చేర్చండి.

ప్రస్తుత రోజుల్లో చాలామందికి గ్యాస్ (Gas) , మలబద్ధకం మరియు అతిసారం వంటి జీర్ణ క్రియ కు సంబంధించిన సమస్యలు రావడం సాధారణం అయిపోయాయి. జీవనశైలి (Lifestyle) లో మార్పులు మరియు ఆహారం (Food) తీసుకోవడంలో అవాంతరాలు వీటికి ప్రధాన కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. జీర్ణ సమస్యల నుండి బయటపడడానికి కొన్ని రకాల సింపుల్ మెడిసిన్స్ మరియు ఇంటి చిట్కాల (Home remedies) తో సులభంగా బయటపడవచ్చు.
అయితే కొన్ని సందర్భాల్లో దీని తీవ్రత అధికంగా ఉంటే అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతంగా భావించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యలు తరచుగా కొనసాగితే దానిని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స (Treatment) తీసుకోవడం చాలా అవసరం.

ప్రతి ఒక్కరు తమ జీర్ణ వ్యవస్థను సహజంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఉత్తమమైన మార్గం ఫైబర్ (Fiber) ఉన్న ఆహారం తీసుకోవడం. కాబట్టి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని చేర్చుకోవాలి. కొన్ని రకాల పండ్ల (Fruits) లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇటువంటి పండ్లను తినడం ద్వారా జీర్ణక్రియ సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఫైబర్ అధికంగా ఉండే పండ్లు ఏమిటో తెలుసుకుందాం:

Also Read : అరటి పండ్లు కూడా కొన్ని సార్లు అనారోగ్యానికి గురిచేస్తాయి, మరి ఆ పరిస్థితులు ఏంటో తెలుసుకోండి.

Stones in Kidney : కిడ్నీలో రాళ్ల ఏర్పాటుకు కారణాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోండి ఇలా ..

ఆపిల్:

మన ఆరోగ్యాన్ని రక్షించే పండ్లలో ఆపిల్ (Apple) ఒకటిగా పరిగణించవచ్చు.  ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పండు తినడం ఆరోగ్యానికి మంచిది. ఈ పండు జీర్ణ ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది అని పరిశోధకులు కనుగొన్నారు. ఆపిల్స్ లో పెక్టిన్ (Pectin) అనే ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం మరియు అతిసారం రెండింటికి చక్కటి పరిష్కార మార్గం. నీటిలో కరిగే స్వభావానికి మరియు శరీరంలోని కొలెస్ట్రాల్ లేదా ట్యాక్సిన్ లను తగ్గించడంలో చాలా బాగా ప్రసిద్ధి చెందింది.

కివి ఫ్రూట్:

విటమిన్స్ అధికంగా ఉండే పండ్లలో కివి పండు (Kiwi Fruit ) ఒకటి. దీనిని రోగనిరోధక శక్తిని పెంచే పండ్లలో ఒకటిగా పరిగణించవచ్చు. అయితే ఈ పండు జీర్ణ క్రియ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కివి పండు డైటరీ ఫైబర్ యొక్క మంచి మూలం అని పరిశోధకులు కనుగొన్నారు. కాబట్టి దీనిని తినటం వల్ల కడుపుకి సంబంధించిన అనేక సమస్యలను తగ్గిస్తుంది. కివి పండులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ కూడా ఉంది. ఇది ప్రోటీన్ల జీర్ణక్రియను మెరుగ్గా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

Digestive System: Take these fruits and take a break from digestive problems
image credit : Bellamy’s organic

అరటిపండు:

అరటి పండు (Banana) లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల అజీర్ణం మరియు అతిసారం (Diarrhea)  రెండింటికి చాలా బాగా పనిచేస్తుంది. అరటి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేయడానికి మరియు జీర్ణ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పొట్ట (Stomach) లో ఏర్పడే కూతల నుండి పొట్టను రక్షిస్తుంది.

మామిడిపండు:

మామిడి పండు (Mango) లో కూడా విటమిన్ – సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మామిడి పండులో చాలా ఎంజైమ్ లు ఉన్నాయి. ఇవి ప్రోటీన్ ను సులభంగా విచ్ఛిన్నం చేయడంలో మరియు జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. మలబద్ధక (Constipation) సమస్యను తొలగిస్తుంది. మామిడి పండులో ఉన్న ఫైబర్ మొత్తం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. దీనిని తినడం వల్ల కడుపు సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది.
కాబట్టి జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడే వారు ఆహారంలో ఈ నాలుగు (Four) రకాల పండ్లను చేర్చడం వలన జీర్ణక్రియ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు.

Comments are closed.