ఆరోగ్యంతో పాటు అందాన్నిచ్చే అరటిపండు, బనానా ఫేస్ ప్యాక్ తో చందమామ అందం మీ సొంతం

అరటిపండు ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా ఇస్తుంది. అరటిపండుతో చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించి మహిళలు తమ ముఖ వర్చస్సును మెరుగుపరచుకోవచ్చు. అరటిపండు ఫేస్ ప్యాక్ తో నిగారింపయిన చర్మం మీ సొంత మవుతుంది.

వాతావరణం లో మార్పులు మరియు పెరుగుతున్న కాలుష్యం (Pollute) వల్ల చర్మంపై నేరుగా ప్రభావం పడుతుంది. అటువంటి సమయంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ (Care) తీసుకోవడం అవసరం. దీనికోసం చాలామంది పార్లర్ కి వెళ్లి చికిత్స తీసుకుంటారు. పార్లర్ లో తీసుకునే చికిత్స వల్ల చర్మం (Skin) కాంతివంతంగా మారుతుంది. కానీ దాని ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. పార్లర్ కి వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా పార్లర్ లో పొందే నిగారింపు చర్మం ఇంట్లోనే పొందవచ్చు. మెరిసే చర్మం పొందడం కోసం ఇంట్లోనే తయారు చేసుకుని వాడే కొన్ని ఇంటి చిట్కాలను (Home remedies) తెలియజేస్తున్నాం.

అరటిపండు (Banana) ను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. అరటిపండు లో పొటాషియం (Potassium) పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ -జింక్ (Zinc) యొక్క మూలంగా కూడా పరిగణించబడుతుంది. అందువలన ఇది చర్మ సమస్యలను నిర్మూలించడంలో సహాయపడుతుంది.

Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం

waxing :వ్యాక్సింగ్ తర్వాత చర్మంపై మంట మరియు దురద ఉంటే ఇలా చేయండి రిలీఫ్ పొందండి.

అరటి పండును ఉపయోగించి తయారు చేసే ఫేస్ ప్యాక్ (Face pack) ల గురించి తెలుసుకుందాం .. 

అరటిపండు మరియు వేపాకులు:

ఈ ప్యాక్ చేయడానికి ముందుగా అరటిపండును పేస్ట్ చేయాలి. దీనిలో ఒక స్పూన్- వేప పొడి (Neem powder) మరియు దానిలోనే ఒక టీ స్పూన్- ఆర్గానిక్ పసుపు కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ సిద్ధమైంది. దీనిని ముఖం (Face) మరియు మెడ(Neck) మీద అప్లై చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటి (Normal Water) తో కడగాలి. ఇది ముఖానికి తక్షణమే గ్లో (Glow) ఇస్తుంది.

అరటిపండు, బొప్పాయి మరియు కీర:

Chandamama's beauty is yours with the banana face pack that gives you health and beauty
image credit : 10 tv telugu

ఈ ప్యాక్ తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల అరటిపండు గుజ్జులో, ఒక టీ స్పూన్ -దోసకాయ పేస్ట్, మరియు ఒక టీ స్పూన్ -బొప్పాయి గుజ్జు వేసి కలపాలి. ఇప్పుడు ఈ ప్యాక్ ని ముఖానికి అప్లై (Apply) చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని (Hot Water) నీటితో కడగాలి. అరటిపండు చర్మానికి పోషణ ని ఇస్తుంది. బొప్పాయి (Papaya) ని అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న పిగ్మెంటేషన్ (Pigmentation) ను తొలగిస్తుంది. దోసకాయ ముఖ చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

అరటిపండు మరియు పెరుగు:

Chandamama's beauty is yours with the banana face pack that gives you health and beauty
image credit : Femina.in

అరటిపండు గుజ్జులో, పెరుగు (Curd)ను వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ ప్యాక్ వల్ల ఉపయోగం ఏంటంటే చర్మంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (Pre-Radicals) మరియు ముఖం మీద తెరచుకున్న రంధ్రాల (Open pore) ను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు చర్మం మీద ఉన్న ముడతలు మరియు ఫైన్ లైన్ల (Pine line) ను కూడా తగ్గిస్తుంది.

కాబట్టి ఇంటి దగ్గరే ఇటువంటి చిట్కాలు పాటించడం ద్వారా ముఖా (Face) న్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు లను కూడా తొలగించుకోవచ్చు. పార్లర్ (Parlor) లో పొందే నిగారింపు చర్మం ను ఇంట్లోనే పొందవచ్చు.

Comments are closed.