Cinnamon : వారెవ్వా! దాల్చిన చెక్క, మేని నిగారింపులను ఇస్తుంది పక్కా. అబ్బురపరచే ప్రయోజనాల దాల్చిన చెక్క

చాలామంది స్కిన్ కేర్ పేరుతో రసాయన ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల చర్మానికి మేలు చేసే బదులు హాని కలుగ చేస్తున్నాయి. మెరిసే చర్మం పొందడం కోసం దాల్చిన చెక్క ఏ విధంగా చర్మానికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

ప్రతి సీజన్లో చర్మాన్ని తప్పకుండా సంరక్షించుకోవడం (preserve) అవసరం. చర్మం పట్ల రక్షణ తీసుకోవడం అంటే రసాయనాలతో కూడిన క్రీములు, లోషన్లు, సెలూన్ లు, పార్లర్ వంటి వాటికి డబ్బు ఖర్చు చేయడం కాదు.

చాలామంది స్కిన్ కేర్ పేరుతో రసాయన ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల చర్మానికి మేలు చేసే బదులు హాని (harm) కలుగ చేస్తున్నాయి. కొంతమంది వాటిని వాడటం వల్ల ముఖం మీద మచ్చలు, దద్దుర్లు, ఎలర్జీ లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు.

కానీ చర్మ సమస్యలకు (skin problems) మార్కెట్లో లభించే ఖరీదైన మందులు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడే బదులు సహజ పద్ధతిలో ఇంట్లోనే క్రీములు, ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకొని వాడటం వల్ల చర్మానికి మేలు చేస్తాయి. స్కిన్ కేర్ కోసం మార్కెట్ కి వెళ్లే బదులు ఒకసారి వంట గదిలో ఉన్న వస్తువులను ఉపయోగించి ప్రయోజనాలను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

వంటగదిలో ఉండే చాలా రకాల పదార్థాలు మన చర్మానికి మరియు జుట్టుకి చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. అయితే ఏ పదార్థాలను ఎలా వాడాలో, ఎందుకు వాడాలో అనే విషయం తెలిస్తే చాలు.

మెరిసే చర్మం పొందడం కోసం దాల్చిన చెక్క (Cinnamon) ఏ విధంగా చర్మానికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

దాల్చిన చెక్క మరియు ఆలివ్ ఆయిల్:

ముఖ సౌందర్యం కోసం ఒక గిన్నెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి మరియు ఆలీవ్ ఆయిల్ ను వేసి కలిపి ముఖానికి రాసుకోవాలి. తర్వాత మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమను పొందుతుంది మరియు రక్తప్రసరణ (Blood circulation) పెరుగుతుంది. చర్మం పొడిగా ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క పొడి మరియు తేనె:

Cinnamon : Who! Pukka gives notes of cinnamon and nutmeg. Amazing benefits of cinnamon
Image Credit : Glam

దాల్చిన చెక్కలు యాంటీ ఫంగల్ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇది ముఖ చర్మాన్ని కాపాడేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనేక చర్మ సమస్యల నుండి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. ఈ ప్యాక్ కోసం గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ముఖానికి వృత్తాకారం (circular) లో సున్నితంగా మర్దన చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి.

Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం

దాల్చిన చెక్క పొడి మరియు కొబ్బరి నూనె :

దాల్చిన చెక్క పొడి మరియు కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్ చర్మంపై వచ్చే దురద నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మం పొడి బారకుండా కాపాడుతుంది. దాల్చిన చెక్క పొడిలో, కొన్ని చుక్కల కొబ్బరి నూనె (coconut oil) వేసి కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి.

దాల్చిన చెక్క పొడి మరియు పెరుగు:

దాల్చిన చెక్క మరియు పెరుగు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో, ఒక స్పూన్ పెరుగు (curd) వేసి మరియు కొంచెం తేనె వేసి కలిపి దీనిని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ ప్యాక్ చర్మానికి మంచి నిగారింపును తీసుకువస్తుంది.

Also Read : Organic Turmeric Powder Face Pack: ఆర్గానిక్ పసుపు ఉండగా మీ చెంత..పార్లర్ కి ఎందుకు డబ్బులు దండుగ.. మెరిసే చర్మం కోసం టర్మరిక్

దాల్చిన చెక్క పొడి మరియు అరటిపండు :

ముఖ సౌందర్యాన్ని పెంచడం కోసం దాల్చిన చెక్క పొడి మరియు అరటిపండు (banana) ఫేస్ ప్యాక్ కూడా చాలా బాగా సహాయపడుతుంది. అరటిపండును బాగా మెత్తగా చేసి, దాంట్లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాలపాటు సున్నితంగా మర్దన (massage) చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్ ముఖానికి అద్భుతమైన మెరుపును తీసుకువస్తుంది.

కాబట్టి వంట గదిలో లభించే పదార్థాలను ఉపయోగించి, ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకొని వాడినట్లయితే మెరిసే చర్మంను సొంతం చేసుకోవచ్చు.

Comments are closed.