Effects Of Hard Water : ఉప్పునీటితో తల స్నానం చేస్తున్నారా? అయితే మీరు ఈ సమస్యలను ఎదుర్కోవలసిందే?

Effects Of Hard Water : Are you bathing your head with salt water? But do you have to deal with these problems?
Image Credit : Good House keeping

ప్రతి ఒక్కరూ తమ జుట్టు (hair) తెల్లబడకుండా, జుట్టు రాలకుండా, నల్లగా, ఒత్తుగా, మెరిసేలా ఉండాలని కోరుకోవడం సహజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, అందాన్ని కాపాడుకోవడంలో కూడా శ్రద్ధ అవసరం.

బిజీ లైఫ్ లో ఆరోగ్యం విషయంలో సరైన శ్రద్ధ (care) తీసుకోలేక పోతున్నారు. దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు చర్మం మరియు జుట్టు పాడై పోవడం వంటివి జరుగుతుంటాయి.

దీంతో పాటు కాలుష్యంతో కూడిన వాతావరణం వల్ల కూడా జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. జుట్టుకు సరైన పోషణ అందకపోతే జుట్టు సమస్యలు వస్తుంటాయి. జుట్టు నిర్జీవం (inanimate) గా మారుతుంది.

అయితే కొంతమంది ఉప్పు నీళ్లతో (Hard water) తలస్నానం చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.

ఈ రోజు కథనంలో ఉప్పు నీళ్లతో తలస్నానం చేయడం మంచిదా, కాదా మరియు ఉప్పు నీళ్లతో తల స్నానం చేస్తే చేస్తే జుట్టుకు ఏమైనా ఇబ్బంది (trouble) వస్తుందా అనే విషయం తెలుసుకుందాం.

Also Read : Long hair growth: పొడవాటి శిరోజాల కోసం ఈ సహజ పద్దతులు పాటించండి

ఉప్పు నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడి బారుతుంది. అంతేకాకుండా జుట్టు చిట్లి పోతుంది. ఎండలో ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తే జుట్టు మరింత దెబ్బతింటుంది. ఉప్పు నీళ్లు జుట్టును డీ హైడ్రేట్ చేసి వెంట్రుకలను పెళుసు (fragile) గా అయ్యేలా చేస్తాయి.

Effects Of Hard Water : Are you bathing your head with salt water? But do you have to deal with these problems?
Image credit : Sunday Edit -Sunday Riley

ఉప్పునీరు జుట్టు లోని సహజ తేమ (Natural humidity) ను కోల్పోయేలా చేస్తుంది. ఉప్పు నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పై ఉండే పొరను దెబ్బతీస్తుంది. ఉప్పునీళ్లతో తరచుగా తల స్నానం చేయడం వల్ల వెంట్రుకల రంగు మారిపోతుంది. తెల్ల జుట్టు త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Also Read : Aloe Vera : కలబందతో జుట్టును ధృడంగా, కాంతివంతంగా మార్చుకోండి

ఉప్పు నీటితో తల స్నానం చేయడం వల్ల తల చికాకుగా ఉంటుంది. తలలో ఉన్న మురికి మరియు జిడ్డు సరిగా పోదు. జుట్టు బలహీనంగా మారుతుంది. దీంతో పాటు తలలో దురద (itching) కూడా వస్తుంది. తరచుగా ఉప్పు నీటితో తల స్నానం చేసినట్లయితే జుట్టు సహజత్వాన్ని కోల్పోతుంది.

ఒకవేళ తప్పని పరిస్థితులలో ఉప్పునీళ్ళతో తలస్నానం చేయవలసి వస్తే ఆ తర్వాత సాధారణ నీటితో (with plain water) వెంట్రుకలను కడగడం వలన కొంతవరకు జుట్టు సమస్యలను అరికట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఉప్పు నీటితో తల స్నానం చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Telugu Mirror
Telugu Mirror is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field at telugumirror.in