Fruit Peels Face Pack : ‘తొక్క’ లే అని విసిరివేయకండి – చేసే మేలు తెలిస్తే షాకవుతారండి

సీజన్ మారిన వెంటనే చర్మంపై వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. చాలామంది అనేక రకాల చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమందికి ఈ చికిత్సలు సరిపడవు. అటువంటి సందర్భంలో ముఖానికి పండ్ల తొక్కలను ఉపయోగించి చర్మం ను కాంతివంతంగా ఎలా మార్చుకో వచ్చో ఈరోజు కథనంలో తెలుసుకుందాం.

కాలుష్యంతో కూడిన వాతావరణం, అస్తవ్యస్తమైన (Disorganized) జీవనశైలి ఇలా రకరకాల కారణాలవల్ల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తమ చర్మం మెరుస్తూ ఉండాలని కోరుకోవడం సహజం.

వాస్తవానికి సీజన్ మారిన వెంటనే చర్మంపై వివిధ రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి చాలామంది అనేక రకాల చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది వీటి ద్వారా ప్రయోజనం పొందుతారు.

కానీ కొంతమందికి ఈ చికిత్సలు సరిపడవు. అటువంటి సందర్భంలో ఈ చికిత్సల గురించి భయపడతారు. అందుకే చాలామంది ఇంటి చిట్కాల పై ఆధార పడుతూ ఉంటారు. వీటివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే ఇవి చర్మానికి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి.

ముఖానికి పండ్ల తొక్కలను ఉపయోగించి చర్మం ను కాంతివంతంగా ఎలా మార్చుకో వచ్చో ఈరోజు కథనంలో తెలుసుకుందాం.

Fruit Peels Face Pack : Don't throw it away because it's 'peeled' - you'll be shocked to know what it does
Image Credit : Telugu Mirror

అరటి తొక్క:

అరటి తొక్క (Banana peel) చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు చర్మానికి తేమను కూడా అందిస్తుంది. అరటి తొక్కను పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. లేదా అరటిపండు తొక్కను నేరుగా కూడా ముఖంపై రుద్దవచ్చు. ఈ విధంగా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆరెంజ్ పీల్ :

నారింజ తొక్కని వాడటం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు మరియు నల్ల మచ్చలు తగ్గిపోతాయి. దీనికోసం నారింజ తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నారింజ పొడి (Orange powder) లో, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.

Also Read : Black Spots On Fore Head : నుదిటిపై నల్ల మచ్చలను సులువుగా తొలగించే ఇంటి చిట్కాలు

బొప్పాయి తొక్క :

ముందుగా బొప్పాయి తొక్క (Peel the papaya) ను శుభ్రంగా కడగాలి తర్వాత పేస్టులా చేసి ముఖానికి రాయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Also Read : Fenugreek Seeds Benefits : మెంతుల ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. వాడండి తేడా చూడండి

కివి తొక్క :

కివి పండులో విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండు వివిధ రకాల చర్మ సమస్యలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కివి తొక్క (Peel the kiwi) లు మరియు పెరుగు కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుస్తుంది.

కాబట్టి మెరిసే చర్మం (Glowing skin) కావాలనుకునేవారు ఈ పండ్ల తొక్కలను ఉపయోగించి కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.

Comments are closed.