Hair Growth : పూర్తి సహజ పద్దతులలో కేశ సంరక్షణకు ఇలా చేయండి.

జుట్టు సమస్యలతో ప్రస్తుత కాలంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే సింపుల్ గా ఇంటిలో లభించే వాటితో సహజ పద్దతిలో జుట్టు సమస్యలను ఇలా చేసి తొలగించుకోండి.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యలలో జుట్టు రాలే (Hair loss) సమస్య ఒకటి. ఆహారపు అలవాట్లలో మార్పులు, మరియు పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అలాగే పెరిగిన కాలుష్యం (Pollution). వీటిని ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. వీటి ప్రభావం జుట్టు, చర్మంపై పడుతున్నాయి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కూడా జుట్టుకు అందాల్సిన పోషక విలువలు అందడం లేదు. దీంతో జుట్టు నిర్జీవంగా మారిపోయి, పొడి బారుతుంది. అలాగే జుట్టు కూడా రాలిపోతుంది.

మహిళలకైనా, పురుషులకైనా జుట్టు నల్లగా, ఒత్తుగా ఉంటే అందంగా కనిపిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉంటే వివిధ రకాల హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. హెయిర్ స్టైల్స్ వల్ల చాలా ఆకర్షణీయంగా గా కనిపిస్తారు.

అయితే ప్రస్తుత రోజుల్లో జుట్టు పెరిగే విషయం కన్నా ఉన్న జుట్టు రాలకుండా కాపాడుకోవడమే చాలా కష్టంగా మారిన సమస్య. అంతేకాకుండా రసాయనాల (chemicals) తో ఉన్న షాంపూలు మరియు కండీషనర్స్ వాడటం వల్ల జుట్టుకు మరింత  (Side effects) ను కలిగిస్తున్నాయి. చిన్నవయసులోనే బట్టతల మరియు జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Also Read : Bye Bye Hair Dye : హెయిర్ డై కి టాటా చెప్పండి, సహజ చిట్కాలతో తెల్ల జుట్టును నల్లబరచండి

చాలామంది గంటలు తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడి (Mental stress) కి లోనవడం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు రాలే సమస్యలు అధికమవుతున్నాయి.

కొంతమంది పార్లర్ (Parlor) కు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. వాటిని వాడడం వల్ల జుట్టు పై చెడు ప్రభావాలు చూపిస్తున్నాయి. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల సహజ పద్ధతులను  (Natural methods) పాటించడం వల్ల జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు.

Hair Growth : పూర్తి సహజ పద్దతులలో కేశ సంరక్షణకు ఇలా చేయండి.
image credit : Image Beauty Scara

ఇంట్లో తయారు చేసుకుని వాడే కొన్ని ఇంటి చిట్కాలను తెలసుకుందాం : 

కరివేపాకు మరియు కలబంద:

ఒక మిక్సీ గిన్నెలో గుప్పెడు కరివేపాకులు, కొద్దిగా కలబంద గుజ్జు మరియు రెండు స్పూన్ల- బియ్యం, కొబ్బరినూనె, రెండు స్పూన్ల పుల్లటి పెరుగు వీటిని మిక్సీ పట్టి మెత్తని పేస్టులా సిద్ధం చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ సిద్దం అయింది. దీనిని  జుట్టు మొదల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూ (Mild shampoo) తో తల స్నానం చేయాలి.

మందార పువ్వులు మరియు కొబ్బరినూనె:

ఒక గిన్నెలో 250 ml కొబ్బరి నూనె వేసి అందులో ఎర్రని మందార పువ్వులు, గుప్పెడు కరివేపాకు రెమ్మలు, కొద్దిగా గోరింటాకు, కొద్దిగా తులసి ఆకులు, కొద్దిగా ముద్ద కర్పూరం (Lumpy camphor)  వేసి సన్నని మంట మీద నూనె రంగు మారేవరకు మరిగించాలి. చల్లగా అయ్యాక ఈ నూనెను ఒక గాజు సీసాలో భద్ర పరుచుకోవాలి. ఈ నూనెను తలకు రోజు రాసుకోవడం వల్ల జుట్టు పెరగడంతో పాటు, చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

Also Read : Aloe Vera : కలబందతో జుట్టును ధృడంగా, కాంతివంతంగా మార్చుకోండి

అవిసె గింజలు:

జుట్టును షైనీ గా మరియు మందంగా చేయడంలో అవిసె గింజలు (Flax seeds) చాలా బాగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల అవిసె గింజలను వేయాలి. స్టవ్ వెలిగించి దీనిని పది నిమిషాలు మరిగించాలి. చల్లగా అయ్యాక వడకట్టాలి. ఈ జెల్ జుట్టుకు కండీషనర్ లాగా పనిచేస్తుంది. వేరే కండిషనర్ వాడాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా జుట్టు బలంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ఇటువంటి కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా జుట్టు సమస్యల నుండి బయటపడవచ్చు.

Comments are closed.