Peel Of Mask : ముఖ సౌందర్యానికి, చర్మ సంరక్షణకు తోడ్పడే “పీల్ ఆఫ్ మాస్క్”. ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకోండి ఇలా

కాలుష్యంతో కూడిన వాతావరణం వల్ల ప్రజల చర్మంపై చెడు ప్రభావం పడుతుంది. ఇంట్లోనే తయారు చేసుకుని వాడే కొన్ని పీల్ ఆఫ్ మాస్క్ ల గురించి తెలియజేస్తున్నాం. ఇటువంటి మాస్క్ లను ఉపయోగించడం వల్ల చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

కాలుష్యంతో కూడిన వాతావరణం వల్ల ప్రజల చర్మంపై చెడు ప్రభావం పడుతుంది. దీని కారణంగా ముఖం చాలా డల్ (Dull) గా మారడం ప్రారంభమవుతుంది. మరియు ఇతర రకాల సమస్యలు ముఖంపై వస్తుంటాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి ప్రజలు అనేక రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు.

చర్మ తత్వాన్ని బట్టి కూడా సౌందర్య సాధనాలు మార్కెట్లో అందుబాటులో లభ్యమవుతున్నాయి. వీటిని వాడటం వల్ల కొన్ని రోజులు వరకు చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. కానీ వాటి నుండి మంచి ఫలితాలను ఎక్కువ రోజులు పొందలేరు.

అందుకే ఈరోజు కథనంలో ఇంట్లోనే తయారు చేసుకుని వాడే కొన్ని పీల్ ఆఫ్ మాస్క్ (Peel of mask) ల గురించి తెలియజేస్తున్నాం. ఇటువంటి మాస్క్ లను ఉపయోగించడం వల్ల చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. ఈ మాస్క్ లు వాడటం వల్ల చర్మ సమస్యలను పూర్తిగా తొలగించుకోవచ్చు.

పీల్ ఆఫ్ మాస్క్ ల గురించి తెలుసుకుందాం.

Peel Of Mask : "Peel of mask" which helps in facial beauty and skin care. Now make it at home like this
image credit : designottoboni.com.br

చార్ కోల్ పీల్ ఆఫ్ మాస్క్:

ఈ పీల్ ఆఫ్ మాస్క్ ను తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ బొగ్గు పొడి (Coal powder), ఒక టేబుల్ స్పూన్ బెంటోనైట్ క్లె (Bentonite clay) మరియు ఒక టేబుల్ స్పూన్ జెలటిన్ ను ఒక గిన్నెలో వేసి కలపాలి. ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి పేస్ట్ లా సిద్ధం అయ్యాక ముఖము మరియు మెడ పై అప్లై చేయాలి. ఆరిన తర్వాత మాస్క్ ని తొలగించి సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇది చర్మంలో ఉన్న అదనపు నూనెను తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

నిమ్మ మరియు తేనె పీల్ ఆఫ్ మాస్క్ :

నిమ్మ మరియు తేనె రెండూ కూడా వివిధ రకాల చర్మ సమస్యలను తొలగించే లక్షణాలు ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసంలో, ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) మరియు ఒక టేబుల్ స్పూన్ జెలటిన్ వేసి కలపాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు పోసి పేస్టులా కలపాలి. దీనిని ముఖానికి మరియు మెడకు పట్టించాలి. కొంత సమయం తర్వాత ఈ మాస్క్ ను తొలగించాలి.

Also Read : Face Pack : పాలు, తేనెలతో పాలుగారే ముఖం మీ సొంతం

దోసకాయ పీల్ ఆఫ్ మాస్క్:

కమిలిన చర్మం ను తగ్గించే అంశాలు దోసకాయలో ఉన్నాయి. ఈ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా చిన్న దోసకాయ ను తీసుకొని పేస్టులా చేయాలి. తర్వాత ఈ పేస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ జెలటిన్ (Gelatin) వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మాస్క్ ను తొలగించాలి.

Also Read : Organic Turmeric Powder Face Pack: ఆర్గానిక్ పసుపు ఉండగా మీ చెంత..పార్లర్ కి ఎందుకు డబ్బులు దండుగ.. మెరిసే చర్మం కోసం టర్మరిక్

ఎగ్ వైట్ పీల్ ఆఫ్ మాస్క్:

గుడ్డు అందరి చర్మానికి సరిపోదు. అటువంటి వారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ మాస్క్ తయారు చేయడానికి గుడ్డులోని తెల్లసొన, పచ్చ సొన రెండిటిని వేరు చేయాలి. తర్వాత తెల్ల సొన ను బాగా నురగ వచ్చే వరకు స్పూన్ సహాయంతో గిలకొట్టాలి. ఇప్పుడు ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత మాస్క్ ను తొలగించాలి.

కాబట్టి ఇంట్లో నే తయారుచేసిన పీల్ ఆఫ్ మాస్క్ ను ఉపయోగించండి. తద్వారా మెరిసే చర్మంను పొందండి.

Comments are closed.