Ghee : అధిక బరువుపై అపోహ వద్దు, నెయ్యితో ఈ పదార్ధాలు చేర్చండి బరువు తగ్గండి! ఆరోగ్యం పొందండి!!

చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని నమ్ముతారు అయితే ఇందులో నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని రకాల పదార్థాలలో నెయ్యిని కలిపి తింటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కధనంలో ఆ పదార్ధాల గురించి తెలుసుకుందాం.

చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని నమ్ముతారు అయితే ఇందులో నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి కొన్ని రకాల పదార్థాలలో నెయ్యిని కలిపి తింటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది నెయ్యి (ghee) తినడం వల్ల బరువు పెరిగే అవకాశమే లేదు.

నెయ్యితో ఏయే పదార్థాలను కలిపి తినడం వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం :

దాల్చిన చెక్క మరియు నెయ్యి :

దాల్చిన చెక్కలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క పొడి మరియు నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల దీని ప్రయోజనాలు అధికమవుతాయి. పాన్ లో నెయ్యి వేసి అందులో కొద్దిగా దాల్చిన చెక్క (Cinnamon) ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత పొడి చేయాలి. ఈ పొడిని వాడినట్లయితే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను పొందవచ్చు. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Dal Rice : అన్నం, పప్పు, నెయ్యి పేర్లు వింటేనే నోరూరుతుంది.. మరి ప్రయోజనాలు తెలిస్తే ఇంకెలా ఉంటుంది..

 నెయ్యి మరియు పసుపు : 

Ghee : Don't worry about excess weight, add these ingredients with ghee and lose weight! Get healthy!!
Image Credit : The Times Of India

పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పసుపు (turmeric) ను నెయ్యితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వచ్చే అన్ని రకాల మంటలు తగ్గుతాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నెయ్యి తీసుకొని, అందులో ఒక టీ స్పూన్- పసుపు, అర టీ స్పూన్ – మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనిని గాలి చొరబడిని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ప్రతిరోజు ఒక స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల శరీర బరువును తగ్గించుకోవచ్చు.

నెయ్యి మరియు తులసి :

తులసి (basil) ఆకులు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి. దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. నెయ్యిలో కొన్ని తులసి ఆకులు వేసి వాడటం వల్ల శరీరానికి మరింత పోషక విలువలను కూడా అందిస్తుంది.

Also Read : Desi Ghee : బ్యూటీ పార్లర్ కి వద్దు..దేశీ నెయ్యి ముద్దు.. చర్మం నిగారింపు ఇప్పుడు నెయ్యితో?

నెయ్యి మరియు పచ్చ కర్పూరం :

కర్పూరం చేదు మరియు తీపి రుచులను కలిగి ఉంటుంది. కర్పూరం (Camphor) తీసుకోవడం వల్ల వాత, పిత్త సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇది పొట్టలో ఉండే నులిపురుగు (Worms) లను నాశనం చేస్తుంది. జ్వరం తగ్గడంలో సహాయపడుతుంది.నెయ్యిలో ఒకటి నుంచి రెండు ముక్కలు తినే కర్పూరాన్ని వేసి ఐదు నిమిషాలు వేడి చేసి వాడుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

నెయ్యి మరియు వెల్లుల్లి :

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. నెయ్యి, వెల్లుల్లి (garlic) కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు చేకూరతాయి. ఇవి శరీరంలో వచ్చే మంటను తగ్గిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. వెల్లుల్లి తో పాటు లవంగాలను (cloves) కూడా కలిపి తింటే మంచిది. దీనికోసం లవంగాలను కొద్దిగా వేడి చేసి తర్వాత అందులో కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక కప్పు నెయ్యి వేసి కలపాలి. కొన్ని గంటలపాటు నానిన తర్వాత వీటిని వడకట్టాలి. ఈ నెయ్యిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

గమనిక : ఈ కథనం వివిధ మాధ్యమాల ద్వారా సమీకరించి వ్రాయబడినది. దీనిలోని అంశాలు కేవలం అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించగలరు.

Comments are closed.