Gold Purchase : బంగారం కొంటున్నారా? చట్ట ప్రకారం ఇలా కొనుగోలు చేయాలి

బంగారం కొనుగోలు చేసినప్పుడు పాటించవలసిన నిబంధనలను కొనుగోలు దారులు తెలుసుకోవడం అవసరమైన విషయం. ఈ కధనంలో బంగారం కొనుగోలు సమయంలో తెలుసుకోవలసిన విషయాలను తెలియపరుస్తున్నాము.

బంగారం చాలా విలువైనది (valuable) అని మన అందరికి తెలిసిందే పుట్టినరోజులు, పండుగలు నుంచి వివాహాల వరకు మనం బంగారం కొనుగోలు చేస్తుంటాం, అయితే త్వరలోనే పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తున్నందున బంగారం షాపింగ్ చేయడానికి సమయం దగ్గర పడింది, కాబట్టి బంగారం కొనుగోలు (purchase) చేసేటప్పుడు మీరు కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి, మనం బంగారం కొనుగోలు చేశాక డబ్బు రూపంలోనే చెల్లింపును చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడే మీకు కొన్ని ప్రశ్నలు ఎదురు అవుతాయి అవి ఏంటో చూద్దాం.

KYC (Know Your Customer) లేకుండ ఎంత ధర వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు

Gold Purchase: Are you buying gold? According to the law, this should be purchased
Image Credit : NDTV

బంగారాన్ని రెగ్యులరైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Central government) ఆదాయపు పన్ను శాఖ ద్వారా జెమ్స్ మరియు జ్యూయలరీ రంగాన్ని మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 ప్రకారం, ఎవరైనా డబ్బుతో బంగారం కొనుగోలు చేయాలి అంటే , వారు కొంత మొత్తం వరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. అంతకంటే ఎక్కువ డబ్బుతో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, అనగా రూ.10 లక్షలకు మించిన లావాదేవీ (transaction) ఏదైనా చేయాలి అనుకుంటే వారు తప్పనిసరిగా KYC నిబంధనలను అనుసరించవలసి వస్తుంది. అందువల్ల కొనుగోలు చేసే వారి పాన్ లేదా ఆధార్ గురించి సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది.

Also Read : Iscon Golden Temple : హైదరాబాద్ లో హరే కృష్ణ దేవాలయం.. అద్భుత చరిత్ర

ఇంకా ఆదాయపు పన్ను చట్టం ఏమి చెప్తుంది అంటే సెక్షన్ 269ST ప్రకారం మీరు ఒకే రోజులో రూ.2 లక్షల మించి నగదు (cash) కొనుగోలు చేసినట్లు అయితే చట్టాన్ని అతిక్రమించినట్లు అవుతుంది అని సూచిస్తుంది కాబట్టి తప్పనిసరిగా, మీరు రూ.2 లక్షల మించి బంగారాన్ని కొనుగోలు చేస్తే పెనాల్టీ విధించబడుతుంది అదికూడా ఎవరైతే నగదు తీసుకుంటారో వారిపై అపరాధ రుసుం వేస్తారు. తప్పనిసరిగా ఇక్కడ కూడ మీ పాన్ లేదా ఆధార్ గురించి సమాచారాన్ని అందించాలి లేకపోతే శిక్ష (punishment) కు గురి అవుతారు.

Also Read : SBI గృహ రుణ వడ్డీ రేటుపై 65 bps వరకు రాయితీని అందిస్తుంది

మీరు బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెల్లించాల్సిన రుసుము (fee) ఏమిటి?

బంగారం కొనుగోలు చేసే వారికి విధించే ఛార్జీలు ఈ విధంగా ఉంటాయి. కొనుగోలు పై 10% దిగుమతి (Import) ఛార్జీలు, తయారీ మరియు ఇతర ఖర్చులకు 3% GST అదనంగా, ప్రభుత్వం 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) విధిస్తుంది.

సంవత్సరంలో మీ బంగారు కొనుగోళ్ల ధర రూ.1లక్ష మించినట్లు అయితే 1% TDS (Tax Deducted at Source) చెల్లించాల్సి ఉంటుంది.

Comments are closed.