Natural Face Pack : మచ్చలు పోయి సహజత్వం ఉట్టిపడాలంటే.. ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే ..

Telugu Mirror : యుక్త వయసు రాగానే శరీరంలో చాలా మార్పులు రావడం సహజం .13- 14 సంవత్సరాల వయస్సు నుండి శరీరంలో మార్పులు వస్తుంటాయి‌. కలుషితమైన వాతావరణం,సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా – వయొలెట్ కిరణాలు(UV rays), అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు ఒత్తిడి వల్ల శరీరంలో అనేక మార్పుమచ్చలు పోయి సహజత్వం ఉట్టిపడాలంటే .. ఈ నాచురల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయాల్సిందే ..
లు వస్తుంటాయి.వీటి యొక్క ప్రభావం శరీరం మీద కన్నా ముఖంపై ఎక్కువగా ఉంటుంది. మొటిమలు,నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్(Pigmentation) ఇవి రావడానికి ఎక్కువ అవకాశంఉంది.

Doctor Prescription : ఆరోగ్య సంరక్షణ మన బాధ్యత.. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి–ఆదేశాలు జారీ

వీటిని తగ్గించడానికి ఇంటి చిట్కాలు లేదా మందుల సహాయంతో తగ్గించుకోవచ్చు. కానీ వాటి తాలూకు మచ్చలు అలానే ఉండిపోతాయి. ఇవి తొందరగా చర్మం పైనుంచి పోవు.ఈ మచ్చలను తొలగించడానికి మేము చెప్పబోయే ఫేస్ ప్యాక్(Face Pack) ఉపయోగించడం ద్వారా మీరు రెండు వారాల సమయంలోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, అప్లై చేసే విధానం తెలుసుకుందాం.

Image Credit : The Hanes India

ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు:

  •  బియ్యంపిండి ఒక టీ స్పూన్
  •  పెరుగు మూడు టీ స్పూన్స్
  •  నిమ్మరసం కొద్దిగా
  • తేనె ఒక టీ స్పూన్
  •  పచ్చిపాలు 3 టీ స్పూన్స్
  •  ముల్తానీ మిట్టి ఒక టీ స్పూన్
  • ఆర్గానిక్ పసుపు చిటికెడు
  • దూది కొద్దిగా.

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో మూడు స్పూన్ల పెరుగు తీసుకొని దానిని స్పూన్ సహాయంతో పేస్ట్ లాగా చేయండి .తర్వాత బియ్యం పిండి(Rice floor) మరియు ముల్తానీ మిట్టి(Multani mitti) వేసి కలపండి. తర్వాత పసుపు, నిమ్మరసం, తేనె వేసి కలిపి పేస్ట్ లాగా మిక్స్ చేయండి. మీ ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయినట్లే.ఈ ప్యాక్ ను ఫేస్ కి అప్లై చేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఏదైనా బ్రష్ సహాయంతో ఈ ప్యాక్ ను ముఖము మరియు మెడపై అప్లై(Apply) చేయండి .అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల సేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మంచి నీటితో ముఖము మరియు మెడను మృదువుగా రుద్దుకుంటూ కడగండి .

White Bread : దినచర్యలో వైట్ బ్రెడ్ వాడకం.. మన ప్రాణానికి పెను ప్రమాదం..

తర్వాత ముఖముమరియు మెడ ను పొడి క్లాత్ తో తుడవాలి. తర్వాత ఒక గిన్నెలో పచ్చిపాలు తీసుకొని దానిలో దూదిని ముంచి మీ ముఖం మరియు మెడపై అప్లై చేయండి. ఆరిన తరువాత నీటితో కడగండి. ఈ ప్యాక్ ఉపయోగించిన అనంతరం 6 గంటల వరకు ముఖంపై సోప్ పెట్టకూడదు. ఈ విధంగా మీరు ఈ ఫేస్ ప్యాక్ ను వారంలో, నాలుగు సార్లు వాడవలసి ఉంటుంది. ఇలా రెండు వారాలు చేయండి. తేడాను మీరే గమనిస్తారు. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఎఫెక్టివ్(Active) గా పని చేస్తుంది.

గమనిక: ఈ ప్యాక్ ని అప్లై చేసే ముందు చర్మం పై ప్యాచ్ టెస్ట్ చేయండి .చేసిన తర్వాత ఎటువంటి దురద, ఇబ్బంది లేకపోతే మీరు నిశ్చింతగా ఈ ఫేస్ ప్యాక్ ను వాడవచ్చు.

Leave A Reply

Your email address will not be published.