గాయపడిన PV సింధు, డాక్టర్ల సలహా మేరకు కొన్ని వారాలు ఆటకి దూరం

పీవీ సింధు ఎడమ మోకాలికి గాయం. డాక్టర్ల సూచన మేరకు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నెలలో జరిగే మ్యాచ్ లకి దూరం కానున్నారు.

Telugu Mirror : భారత్ కి డబల్ స్వర్ణ పథకాలను సాధించి పెట్టిన షటిల్ ప్లేయర్ పివి సింధు (PV Sindhu) గత వారం థాయ్‌లాండ్‌ (Thailand)కు చెందిన సుపానిడా కాటెథాంగ్‌తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ రౌండ్ 2 మ్యాచ్‌లో నుండి తప్పుకుంది. ఆమె ఎడమ మోకాలికి గాయం అవడం వల్ల కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్స్ ఆమెని విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పింది.

PV సింధు, భారత షట్లర్ గత వారం ఫ్రెంచ్ ఓపెన్ BWF టూర్ సూపర్ 750 ఈవెంట్‌లో ఒక మ్యాచ్‌ను వదులుకుంది. రౌండ్ 2 మ్యాచ్‌లో, సింధు సుపానిదా కతేథాంగ్‌ (Supanida Katethong)తో తలపడి 21–18తో ఓపెనింగ్ గేమ్‌ను గెలుచుకుంది. రెండవ గేమ్‌లో, స్కోరు ఒకటితో సమంగా ఉండటంతో, ఆమె కథేథాంగ్ నుండి షాట్‌ను ఇస్తున్నప్పుడు సింధు మోకాలికి గాయమైంది. దీని కారణంగా ఆమె గేమ్‌ను మధ్యలో వదిపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం, సింధు కొన్ని వారాల పాటు తాను బయట ఉండనుందని మంగళవారం, అక్టోబర్ 31న X (ట్విట్టర్)లో అధికారికంగా ప్రకటించింది.

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా బోణీ

తాను త్వరలో ఆడేందుకు కోర్టుకు తిరిగి వస్తానని, ఈ విరామం తన ఒలింపిక్స్‌పై ఫోకస్ ఇంకా మెరుగుపరచానికి ఈ విశ్రాంతి వీలు కల్పిస్తుందని సింధు పేర్కొంది. “ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను మోకాలును స్కాన్ చూపించిన తర్వాత  నా ఎడమ మోకాలు క్రాక్ వచ్చినట్లు తెలిసింది అని చెప్పింది.తాను ఆటను వదులుకోవడమే మంచి నిర్ణయం అని చెప్పుకొచ్చింది. మళ్లీ శిక్షణ ప్రారంభించే ముందు కొన్ని వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేసారు. ఇప్పటివరకు నాకు సపోర్ట్ ఇస్తూ నిలిచిన వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నేను అతి త్వరలో కోర్టుకు తిరిగి వస్తాను” అని సింధు తన ప్రకటనలో పేర్కొంది.

మరోసారి ‘ఉత్తమ ఫీల్డర్’ అవార్డుని అందుకున్న కేఎల్ రాహుల్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియోస్

తొలి రౌండ్‌లో సింధు 12-21, 21-18, 21-15తో ఇండోనేషియా క్రీడాకారిణి గ్రెగోరియా మరిస్కా తుంజంగ్‌ (Gregoria Mariska Tunjung)పై విజయం సాధించింది. ఈ సంవత్సరం నాలుగు సెమీఫైనల్స్ ముగింపుల తర్వాత, సింధు కొంతకాలంగా ఆటలో తడబడుతోంది. తనకున్న ఫామ్ ని కోల్పోయింది. ఆగష్టు నెలలో తన ర్యాంక్ 17కి పడిపోయింది. ఈ నవంబర్ 7 నుండి 12 వరకు కొరియా మాస్టర్స్, నవంబర్ 14 నుండి 19 వరకు జపాన్ మాస్టర్స్, నవంబర్ 21 నుండి 26 వరకు చైనా మాస్టర్స్ మరియు నవంబర్ 28 నుండి డిసెంబర్ 3 వరకు సయ్యద్ మోదీ ఇండియా లో అంతర్జాతీయ టోర్నీలు జరగబోతున్నాయి. ఇటీవల దాదాపు ఆరు నెలల తర్వాత BWF ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు టాప్ 10లోకి అడుగుపెట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు జరిగిన డెన్మార్క్ ఓపెన్ సెమీఫైనల్స్‌లో కరోలినా మారిన్‌తో జరిగిన గట్టిపోటీలో సింధు ఓడిపోయింది.

Comments are closed.