Lemons Storage : నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ పద్దతులలో నిల్వ చేయండి.

చాలామంది మహిళలు నిమ్మకాయలు త్వరగా పాడవుతాయని ఎక్కువ రోజులు నిల్వ ఉండవని చెబుతుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయ లను 30 రోజుల వరకు తాజాగా నిల్వ చేయవచ్చు.

నిమ్మకాయలను (Lemon) ప్రతిరోజు ఇంట్లో వాడుతుంటాం. నిమ్మరసం త్రాగడం ఆరోగ్య ప్రయోజనాలు కూడా వద్దు అధికంగా ఉన్నాయి. నిమ్మరసం ను వివిధ రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుత కాలంలో వంటలలో చింతపండు కు బదులుగా నిమ్మరసం ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకనగా చింతపండు (Tamarind) ఆరోగ్యానికి అంత మంచిది కాదని.

చాలామంది మహిళలు (women) నిమ్మకాయలు త్వరగా పాడవుతాయని ఎక్కువ రోజులు నిల్వ ఉండవని చెబుతుంటారు. కొన్నిసార్లు నిమ్మకాయలు ధర ఒక్కసారి గా పెరుగుతుంది. కొన్నిసార్లు తగ్గుతుంది. అయితే నిమ్మకాయల ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తీసుకొని ఈ విధంగా ప్రయత్నించండి.

నిమ్మకాయలు నెలరోజుల (One Month)పాటు తాజాగా ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయ లను 30 రోజుల వరకు తాజాగా నిల్వ చేయవచ్చు.

నిమ్మకాయలు పాడవకుండా నెల రోజులు పాటు ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం.

నీళ్లలో ఉంచాలి:

Lemons Storage : To keep lemons fresh for longer days, store them in these ways.
Image Credit : Food Storage Moms

నిమ్మకాయలను ఫ్రిజ్ లో నీటిలో ఉంచడం వలన నెల రోజుల వరకు తాజాగా చెడిపోకుండా ఉంటాయి. వీటిని చాలా సులువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఒక గాజు గిన్నె (glass bowl) తీసుకొని దానిలో సగం వరకు నీళ్లతో నింపాలి. తర్వాత నిమ్మకాయ లను శుభ్రంగా కడిగి నీళ్లు ఉన్న గాజు గిన్నెలో వేయాలి. దీనిపై మూత పెట్టకూడదు. ఈ విధంగా చేయడం వల్ల నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Also Read : నిమ్మరసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,కానీ రోజుకు ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు

ఐస్ ట్రే:

Lemons Storage : To keep lemons fresh for longer days, store them in these ways.
Image credit : WikiHow

నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ తో తుడవాలి. ఈ నిమ్మకాయలను కట్ చేసి రసాన్ని (juice)తీయాలి. ఈ రసాన్ని ఐస్ ట్రే లో పోయాలి. ఈ ట్రే ను డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. నిమ్మరసం ఐస్ క్యూబ్ అయినప్పుడు దీనిని వాడుకోవచ్చు.

ప్లాస్టిక్ బాటిల్: 

Lemons Storage : To keep lemons fresh for longer days, store them in these ways.
Image Credit : Cookist

చాలామంది నిమ్మకాయలను కవర్లో పెట్టి ఉంచుతారు. ఇలా చేయడంవల్ల వారం రోజులు వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాత పాడవుతాయి. కాబట్టి నిమ్మకాయలను నిలవ చేయడానికి ప్లాస్టిక్ కవర్ కు బదులుగా ప్లాస్టిక్ బాటిల్ లో పెట్టడం వల్ల నిమ్మకాయలు చెడిపోకుండా (without spoiling) ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Also Read : కూరలలో ఉప్పు ఎక్కువ అయితే సింపుల్ గా ఇలా చేయండి, ఉప్పు తగ్గుతుంది, టేస్ట్ పెరుగుతుంది

పాల్ థిన్ కవర్ :

Lemons Storage : To keep lemons fresh for longer days, store them in these ways.
Image Credit : Food Hacks-wonder how To

నిమ్మకాయలను పాల్ థిన్ కవర్లో పెట్టి అందులో రెండు మూడు పచ్చిమిర్చి (Green Chilly) ని తొడిమలు తీసి నిమ్మకాయలు ఉంచిన కవర్లో వేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

కాబట్టి నిమ్మకాయలు ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో కొని, ఇటువంటి కొన్ని చిట్కాలను (tips) పాటించి నిల్వ చేయడం వల్ల నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Comments are closed.