Restaurant Taste : వంటలలో ఈ పదార్ధాలను వాడండి కూరలో చిక్కదనం,టేస్ట్ లో కమ్మదనం పొందండి

ప్రతి రోజు ఒకే రకమైన ఆహారం తిని బోర్ కొట్టిందా ? అయితే ఈ పదార్దాలని వంటలలో కలపడం ద్వారా రుచికరమైన కూరలను తయారు చేసుకోవచ్చు .

ఇంట్లో రకరకాల వంటలు వండుతుంటారు.ఒక్కొక్కసారి అన్ని రకాల మసాలా దినుసులు (Spices) వేసి వండినా కొన్ని రకాల వంటలు అంతగా రుచిగా అనిపించవు. కాబట్టి కూరలకు అదిరిపోయే రుచి రావాలి అంటే కూర వండేటప్పుడు ఈ పదార్థాలను కూరల్లో కలిపితే ఆ కూరకు రుచి తో పాటు రెస్టారెంట్ (Restaurant) వంటకాల రుచిని తలపిస్తాయి.

సాధారణ ఆహారం (Routine food) తిని తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్త రకం టేస్ట్ కావాలి అని అనుకుంటారు. అటువంటి వారు కూరలు వండేటప్పుడు ఇలా చేసి చూడండి. ఇంతకుముందు వండిన కూరకు, ఇవి కలిపిన తర్వాత వండిన కూరకు తేడా మీకే తెలుస్తుంది.

ఈ పదార్థాలను కూరలో కలపడం వల్ల కూరకు మరింత రుచిని (taste) అందిస్తాయి. ఇంట్లో అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు. కూరల్లో ఈ పిండిని కలపడం వలన కూరలు రుచిగా రావడంతో పాటు చిక్కగా కూడా వస్తాయి.

కూరల్లో ఏ పదార్దాలను కలిపితే కూరకు మరింత రుచి వస్తుందో తెలుసుకుందాం.

పుచ్చ గింజలు:

కూరకు కొత్త రుచి అందించాలంటే పుచ్చకాయ విత్తనాల (Melon Seeds) ను కలపవచ్చు. పుచ్చకాయ విత్తనాలను పొడిచేసి, ఈ పొడిని ఒక గిన్నెలో వేసి  కొంచెం నీళ్లు పోసి కూరకు అవసరమైనంత మోతాదులో పొడిని వేసి కలపాలి. కూర పూర్తిగా ఉడికిన తర్వాత చివర్లో ఈ పిండి నీటిని కలపాలి. కూరకు చిక్కటి గ్రేవీతో పాటు, రుచిని కూడా పెంచుతుంది.

Also Read : బయట కొనే పనిలేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చోలే భాతురే రెసిపీ, ఎలా తయారు చేయాలి

Restaurant Taste: Use these ingredients in cooking to get the richness of the curry and the sweetness of the taste
image credit : Whisk Affair

జీడిపప్పు:

చికెన్ మరియు చీజ్ కూరలు వండేటప్పుడు గ్రేవీ చిక్కగా రావాలంటే జీడిపప్పు (cashew nut) పిండి కలిపితే కూర రుచి రెస్టారెంట్ రుచిని తలపిస్తుంది. జీడిపప్పును పొడి లా చేసి ఈ పొడిని నీళ్లలో కలిపి కూర ఉడికాక కలపాలి. కూర రుచి అదిరిపోతుంది.

శనగపిండి:

సమయం లేనప్పుడు వంట త్వరగా వండేయాలి. అటువంటి సమయంలో కొన్ని రకాల కూరల కి గ్రేవీ కావాలంటే శనగపిండి (Gram Flour) ని నీటిలో కలిపి ఆ నీటిని కూరలో కలపవచ్చు. కూరకి రుచితో పాటు గ్రేవీ కూడా వస్తుంది.

Restaurant Taste: Use these ingredients in cooking to get the richness of the curry and the sweetness of the taste
image credit : FNP

పుల్లటి పెరుగు:

కొన్ని రకాల మసాలా దినుసులు వేసి చేసే వంటలలో పుల్లటి పెరుగు (Curd) కలపడం వలన కూరకు గ్రేవీ తో పాటు మరింత రుచిని తీసుకొస్తుంది.

Also Read : చపాతీలు మృదువుగా రావాలంటే,ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

కాబట్టి కూరలను ఎప్పుడు ఒకే రకంగా వండటం కాకుండా కొత్త రుచిని మరియు చిక్కటి గ్రేవీ ని కూరకి అందించాలంటే ఇలా ట్రై చేసి చూడండి. కూరలకు రుచి రెట్టింపు అవుతుంది.

Comments are closed.