School Timings Change: పాఠశాలల టైమింగ్స్ లో కీలక మార్పులు, ఇదిగో వివరాలు ఇవే!

రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను మార్చనున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. టైమింగ్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

School Timings Change: ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యార్థులంతా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వేసవి సెలవుల తర్వాత, జూన్ 12న రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ వేసవి సెలవుల (Summer Holidaya) తర్వాత విద్యార్థులందరూ తమ తమ పాఠశాలల  (Schools) కు వెళ్ళి చదువుకుంటారు. అయితే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State) లోని పాఠశాలలపై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల పని వేళలను సవరిస్తామని విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనివేళలను మార్చనున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. పాఠశాల తరగతులు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. 2024-25 విద్యా సంవత్సరానికి ఈ పాఠశాల నిర్వహణ టైమింగ్స్ ప్రభావవంతంగా ఉంటాయని SCERT అధికారులు సూచించారు. గతంలో, పాఠశాలలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభం అయ్యేవి కానీ, అప్పటి MLC కూర రఘోత్తం రెడ్డి అభ్యర్థన మేరకు, ప్రాథమిక పాఠశాలల టైమింగ్స్ ను 9:30 గంటలకు సర్దుబాటు చేశారు.

Andhra Pradesh Half Day Schools 2024
దీంతో, ఒకవేళ ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు పిల్లలు, ఒకరిని ఉదయం 9 గంటలకు, మరొకరిని ఉదయం 9:30 గంటలకు పాఠశాలకు తీసుకెళ్లాలి అంటే తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తుంది, కాబట్టి పాఠశాల సమయాలను సవరించాలని కోరారని, మళ్ళీ పాఠశాల వర్కింగ్ అవర్స్ (Working Hours) మార్చారు. అయితే, సెకండరీ పాఠశాలలు ఉదయం 9 గంటలకు తెరుచుకోగా. ఎలిమెంటరీ, సెకండరీ పాఠశాల (Secondary School) లను ఉదయం 9 గంటలకు తెరవాలని నిర్ణయించారు. ఇక హైదరాబాద్ (Hyderabad) మరియు సికింద్రాబాద్‌ (Secunderabad) లలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య మాత్రమే పనిచేస్తాయి.

1-7 తరగతుల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో 1-5 తరగతులు ఉదయం 8:45 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:45 గంటలకు ముగుస్తాయి. ఒకే క్యాంపస్‌లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉంటే, సంబంధిత పాఠశాలలు ఒకే హైస్కూల్ షెడ్యూల్‌ను అనుసరించాలి. కాకపోతే, ఈ పాఠశాలల్లో టైమింగ్స్ (Timings) మాత్రం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది కానీ పాఠశాల ముగిసే సమయాలు వేరు వేరుగా ఉంటాయి. ఇక భోజన విరామం 45 నిమిషాలు ఉంటుంది.

అంతే కాకుండా పాఠశాలల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. అడ్మిషన్లను పొందేందుకు. ఈసారి, బడిబాట కార్యక్రమాన్ని జూన్ 1 నుండి 11 వరకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, 2024-25 విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమై ఏప్రిల్ 23, 2025న ముగుస్తుంది. పాఠశాలలు దాదాపు 229 రోజుల పాటు జరుగుతాయి. SCERT 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యా షెడ్యూల్‌ (Education Schedule) ను శనివారం ప్రకటించింది. ఈ వేసవి విరామం ఏప్రిల్ 24 నుండి జూన్ 11, 2025 వరకు పాఠశాలలకు ఇస్తారు. అలాగే, 10వ తరగతి సిలబస్ జనవరి 10, 2025 నాటికి మరియు 1-9వ తరగతి సిలబస్ ఫిబ్రవరి 28, 2025 నాటికి పూర్తవుతుంది.

Comments are closed.