Telugu Mirror : సాంప్రదాయం ప్రకారం ముఖ్యమైన పండుగలలో రాఖీ పౌర్ణమి(Rakhi Pornami) ఒకటి. ఆ రోజున అన్న చెల్లెల ప్రేమకు చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను ప్రతి ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా చెల్లి తన అన్నకు రాఖీ కడుతుంది. దానికి బదులుగా అన్న ఆమెకు రక్షగా ఉంటానని ఆశీర్వదిస్తాడు.అయితే ఈ సంవత్సరం ఈ పండుగను కొన్నిచోట్ల ఆగస్టు 30న మరియు మరికొన్ని చోట్ల ఆగస్టు 31న జరుపుకోనున్నారు.
Hydra Facial : హైడ్రా ఫేషియల్ తో రెట్టింపు సౌందర్యం మీ సొంతం..మరి తీసుకునే జాగ్రత్తల సంగతి ఏంటి?
ప్రత్యేకమైన ఈరోజు కోసం ముందుగానే సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మరియు స్త్రీలు అయితే రక్షాబంధన్ రోజున ధరించాల్సిన బట్టలు, మేకప్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు.ప్రస్తుత రోజుల్లో ట్రెండింగ్(Trending) లో ఉన్న మేకప్ గురించి మీకు తెలియకపోతే ఈ రోజున మీకు మేము ట్రెండింగ్ లో ఉన్న మేకప్ టిప్స్ గురించి చెప్తున్నాము. వీటిని సరైన పద్ధతి ద్వారా మేకప్ ఎలా వేసుకోవాలో తెలియజేస్తున్నాం.
మొదటి పద్ధతి :
ముందుగా ముఖాన్ని పచ్చిపాలతో శుభ్రపరుచుకోవాలి. దీనికోసం పచ్చిపాలను తీసుకొని దీనిలో కాటన్ ముంచి, దానితో ఫేస్ అంతా రాస్తూ మర్దన చేయాలి. ఆరిన తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.
రెండవ పద్ధతి :
పచ్చి పాలతో ఫేస్ ని క్లీన్ చేసిన తర్వాత జెల్(Jel) బేస్డ్ క్రీమ్ ను ఫేస్ కి అప్లై చేయాలి. ఆ తర్వాత మేకప్ చేయడం వలన అప్పుడు మేకప్ ఎక్కువ సమయం పాటు ఉంటుంది. అలాగే మేకప్ పై ఎలాంటి క్రాక్స్ ఉండవు.
మూడవ పద్ధతి :
ఎప్పుడు కూడా మీ స్కిన్ కు సరిపోయే ఫౌండేషన్ మాత్రమే ఉపయోగించాలి. లేదంటే డార్క్ లేదా లైట్ షేడ్ ఫౌండేషన్ మీ లుక్ ను పాడు చేసే అవకాశం ఉంది.
నాలుగవ పద్ధతి :
మేకప్ సమయంలో కాంటౌరింగ్ చేయాలి. దీనివలన మీ ముఖానికి సరైన ఆకృతిని తెస్తుంది. అలాగే ముఖం షార్ప్ గా కూడా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మేకప్ వేసుకున్న తర్వాత చాలా అందంగా కనిపిస్తారు.
Effects of Tea : మీరు ‘టీ’ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే ..
ఐదవ పద్ధతి :
మేకప్ వేసుకున్న తర్వాత బ్లష్ మరియు హైలైటర్ ని వాడాలని గుర్తించుకోండి. బ్లష్ మరియు హైలైటర్ మేకప్ కి చివరి టచ్ గా పని చేయడంలో సహాయపడుతుంది.
ఆరవ పద్ధతి:
మీరు కళ్ళకు డార్క్ మేకప్ వేసుకుంటే, పెదవులకు లైట్ కలర్ లిప్స్టిక్(LipStick) ను వాడండి. లేదా మీరు పెదవులకు డార్క్ కలర్(Dark Colour) లిప్స్టిక్ అప్లై చేస్తే అప్పుడు కళ్లకు లైట్ కలర్ మేకప్ వేయండి. అప్పుడు మీ రూపం అందంగా మారుతుంది.
కాబట్టి ప్రత్యేక పండగ అయినా రక్షాబంధన్ రోజున మేకప్ వేసుకోవాలి అని అనుకునేవారు ఇటువంటి కొన్ని పద్ధతులు పాటించి మరింత అందంగా రెడీ అవ్వండి.