ATM Scam : ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వెలుగులోకి మరో కొత్త మోసం.

ఏటీఎం సెంటర్లలో మనీ డ్రా చేసేటప్పుడు జాగ్రత్త.. కొత్త తరహా మోసగాళ్లను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు.

ATM Scam : ఈరోజుల్లో యూపీఐ (Google Pay, Phone Pay మరియు ఇతర యాప్‌లు) వినియోగం పెరిగింది.ఇటు ATM కార్డ్‌ల వినియోగం కూడా తగ్గట్లేదు. ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా (Cash Withdrawal) చేసుకునే వినియోగదారులను మోసం చేసేందుకు మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కొత్త తరహా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఖాతాదారులను మోసం చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.

కార్డును ఏటీఎంలో ఇరుక్కుపోయేలా చేయడం..

ఈ ముఠా సభ్యులు ఎలా దోచుకుంటారంటే సెక్యూరిటీ గార్డు (Security guard) లు లేని ఏటీఎం సెంటర్లను ఎంచుకుంటారు. ముందుగా ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరాల (CC Cameras) పై రంగు స్ప్రే చేస్తారు. ఏటీఎం మెషన్ లో కార్డ్ రీడర్ ని తొలగిస్తారు. నగదు డ్రా చేయడానికి వచ్చిన వారు మోషిన్ లో కార్డు పెట్టగానే అందులో ఇరుక్కు పోతుంది. దాంతో, వీరికి సహాయం చేయడానికి వచ్చినట్టు వచ్చి విత్‌డ్రా చేస్తున్నట్టుగా నటిస్తారు.

ATM పిన్‌ను చెప్పమని అడుగుతారు ఎంత ప్రయత్నించినా కార్డు రావడం లేదు అని, బ్యాంకును సంప్రదించాలని చెప్పి వెళ్ళిపోతారు. ఎంత ప్రయత్నించినా కార్డు రాకపోవడంతో కస్టమర్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. కస్టమర్ వెళ్లిన వెంటనే, వారు కార్డుతో తిరిగి వచ్చి నగదు విత్ డ్రా (Money With Draw) చేసుకునేందుకు మరో ఏటీఎంకు వెళతారు.

ATM Scam

జాగ్రత్త పడడం తప్పనిసరి.

ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ఏటీఎం చుట్టూ జనం లేని ప్రదేశం నుంచి నగదు తీసుకునేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు. రాత్రిపూట అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచి వెలుతురు ఉన్న ఏటీఎంల నుంచి మాత్రమే నగదును విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు. ATM కేంద్రంలోకి ప్రవేశించిన తర్వాత, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించాలని మరియు ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించినట్లయితే, మరొక ATMకి వెళ్లడం మంచిది.

ఏటీఎం మెషీన్ (ATM Machine) తెరిచి ఉన్నట్లు కనిపించినా, ఏవైనా కేబుల్స్ కనిపిస్తే వాటిని ఉపయోగించకూడదు అని పోలీసులు పేర్కొన్నారు. ATM రద్దీగా ఉన్నప్పుడు, ఇతరులు మీ పిన్ నంబర్‌ను చూస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల సహాయం తీసుకోవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఒకరి పిన్ నంబర్ మరియు కార్డు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు నుండి వచ్చే మెసేజ్‌లు, స్టేట్‌మెంట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ATM Scam

Comments are closed.