Railway Ticket QR Code : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో పేమెంట్ చేయొచ్చు..

రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే మరో సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి రైల్వే స్టేషన్లలో ATVMల నుంచి టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను ఇకపై క్యూఆర్ కోడ్లపై పొందవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Railway Ticket QR Code : భారతీయ రైల్వే శాఖ నిరంతరం ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది. దీని ఫలితంగా రైల్వే శాఖ లో అనేక సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి. రైల్వే శాఖలో అతి పెద్ద సమస్య టికెట్ల కోసం చాల సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎక్కువ సేపు క్యూలో నిలబడి టికెట్‌ (Ticket) తీసుకునే సమస్యని దూరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్‌ (UTS) అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. చిల్లర సమస్య కారణంగా టికెట్ కౌంటర్లలో డిజిటల్ లావాదేవీలు చేయడానికి వీలు కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోని 14 స్టేషన్లలో 31 కౌంటర్లలో కొత్తగా క్యూఆర్ కోడ్ స్కానర్లను (QR code scanners) తీసుకొచ్చారు.

Also Read : Business Ideas : ఉద్యోగంతో విసిగిపోయారా..తక్కువ ఖర్చుతో అమూల్ ఫ్రాంచైజీ..అదిరే లాభాలు.

టిక్కెట్ విక్రయ కౌంటర్ల వద్ద డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత, బుకింగ్ క్లర్క్ QR కోడ్‌ను డిస్ప్లే చేస్తారు. ఇది ఫోన్ పే, Google Pay, PTM, Amazon Pay మరియు BHIMతో స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఆ తర్వాత రైల్వే అధికారులు మనకి టిక్కెట్టు ఇస్తారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల్, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లలోని 31 కౌంటర్లలో ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సాధారణ కౌంటర్లలో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు వాణిజ్య, సాంకేతిక సిబ్బంది చేస్తున్న కృషిని రైల్వే శాఖ అభినందించింది.

Good news for train passengers.. Payment can now be made with QR code..

భారతీయ రైల్వేలు అమృత్ భారత్ ప్రణాళికలో భాగంగా దేశంలోని అన్ని ముఖ్యమైన స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ స్టేషన్ అయినా సికింద్రాబాద్‌లో (Secunderabad) స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్‌ లో కూడా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. UTS యాప్ ద్వారా రిజర్వ్ చేయని సీట్లు IRCTC ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ టిక్కెట్‌లుగా అందుబాటులో ఉన్నాయి. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా టిక్కెట్ కౌంటర్‌లలో పేమెంట్ చేయడం సులభతరం అయింది.

Railway Ticket QR Code

Comments are closed.