Kisan Vikas Patra : పోస్టాఫీసు నుంచి అదిరిపోయే స్కీమ్.. పెట్టిన పెట్టుబడి డబల్..వివరాలు ఇవే..!

దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండే కిసాన్ వికాస్ పత్ర అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌గా చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది.

Kisan Vikas Patra : మీరు ప్రతిరోజూ రూ. 200 పెట్టుబడి పెడితే, గడువు ముగిసిన తర్వాత మీకు రూ.1,46,000 అందుతుంది. ఇది ప్రభుత్వ పథకాలలో మంచి పథకంగా భావించవచ్చు. ఈ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర. దీనినే మనం KVP అంటాం. దీన్ని రూ. 1000 కనీస మొత్తంతో ప్రారంభించవచ్చు. 18 ఏళ్లు దాటిన వారు ఒక్కరిగా లేదా ముగ్గురు కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు తల్లితండ్రుల సమక్షంలో ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

Also Read : Business Ideas : తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం.. బెస్ట్ బిజినెస్ ప్లాన్స్ ఇవే..!

KVP అనేది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ (Indian Post Office) పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం లో ఒకేసారి పెట్టుబడి పెడితే, అది దాదాపు 9.5 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. దీనికి వడ్డీ రేటు 7.5% గా ఉంది. రిస్క్ లేకపోవడంతో ఈ స్కీమ్ అందరికీ ఉపయోగపడుతుంది. కెవిపిలో రూ. 5000 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో రూ. 10,000 అందుకుంటారు.

Kisan Vikas Patra

ఈ కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) పథకం పెట్టుబడిదారులు ఎంత మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది దీనికి పరిమితులు లేవు. ఈ స్కీంలో ఎవరైనా రోజుకు రూ. 200 చొప్పున సంవత్సరం పాటూ పెట్టుబడి పెడితే వారు మొత్తం రూ. 73,000 పెట్టుబడి పెట్టినట్లవుతుంది. వారు పదేళ్ల లోపే డబుల్ పొందుతారు అంటే మొత్తం రూ. 1,46,000 పొందుతారు. ఈ స్కీమ్‌కి డబుల్ అయ్యే గడువు కాలం 115 నెలలుగా ఉంది. అంటే 9 సంవత్సరాల 7 నెలలు.

Also Read : Kawasaki W175 Street Amazing Bike: 2024 లో రిలీజ్ అయిన కవాసకి W175 వెహికల్ కంప్లీట్ డీటెయిల్స్.

డబుల్ అయ్యే కాలం చాలా ఎక్కువగా ఉంది అని మీకు అనిపించవచ్చు ఐతే ఇది రిస్క్ లేని స్కీమ్. పైగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్, అందువల్ల ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టి, పదేళ్ల తర్వాత డబుల్ మనీ తీసుకుంటున్నారు. మీరూ అలా చెయ్యాలనుకుంటే, ఆలోచించి, సొంత నిర్ణయం తీసుకోవచ్చు.

Kisan Vikas Patra

Comments are closed.