Magnificient Increase on Gold Rates: ఈ రోజు మళ్ళీ పెరిగిన బంగారం ధర. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏంతంటే..

దేశంలో బంగారం ధరలు ప్రస్తుతం హెచ్చుతగ్గులలో నడుస్తున్నాయి. మంగళ వారం తో పోలిస్తే బుధవారంనాడు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ రేటు రూ.110 పెరిగింది. పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Magnificient Increase on Gold Rates: : భారతీయులకు బంగారం అంటే చాలా మోజు సాధారణ సమయాలలో కన్నా పండుగలు, వేడుకల సమయంలో బంగారం కొనుగోలు చేస్తుంటారు. గోల్డ్ జ్యూయలరీ ధరించడం వలన అందం,హోదా పెరుగుతుందని భావిస్తుంటారు భారతీయ మహిళలు. ఇదిలావుండగా దేశంలో ఈరోజు బంగారం ధరలు నిన్నటి రోజు కన్నా పెరిగాయి. దేశంలో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.110 పెరిగి, రూ. 65,750 వద్దకు చేరింది. నిన్న ఈ ధర రూ. 65,640గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.1100 ఎగసి రూ. 6,57,500గా నమోదయింది. ప్రస్తుతం 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,575గా ఉంది.

ఇదిలావుండగా 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.110 పెరిగి రూ. 71,740 వద్ద కొనసాగుతోంది. మంగళవారం రోజు ఇదే 24 క్యారట్ల బంగారం ధర రూ. 71,630గా ఉన్నది. మరోవైపు 24 క్యారట్ల గోల్డ్ 100 గ్రాముల ధర రూ. 1100 వృద్ది చెంది రూ. 7,17,400గా కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా దేశంలోని ముఖ్య నగరాలలో గోల్డ్ రేట్లు బుధవారం రోజున పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 65,950గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,890గా నమోదు అయింది. కోల్​కతాలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 65,760గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 71,740గా పలుకుతోంది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా పసిడి ధరలు ఇవే కొనసాగుతున్నాయి.

మరో వైపు చెన్నైలో 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 66,710గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,770గా నమోదయింది. ఇక పూణే విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,760గా పలికింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,740గా కొనసాగుతుంది.

Today Gold Rates In Telugu States:

హైదరాబాద్​లో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,760గా పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,740గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లు గోల్డ్ రేటు రూ.65,760. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.71,740గాకొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,760 మరియు 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,740గా నమోదయ్యాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,710గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71,790గా పలుకుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,760గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు వచ్చేసి రూ. 71,740గా కొనసాగుతున్నది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు బంగారం ధరలలో మార్పులకు కారణమవుతున్నాయని పసిడి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి రేటు రూ. 8,440గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84,400గా నమోదయింది. నిన్నటి రోజున కిలో వెండి రేటు రూ 84,500గా ఉంది.

Today Silver Rate In Hyderabad:

హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.87,900 పలుకుతోంది. మరోపక్క కోల్ కతాలో కేజీ వెండి ధర 84,400 అలాగే బెంగళూరులో కేజీ వెండి ధర 83,900గా ఉంది.

Magnificient Increase on Gold Rates

 

 

 

 

 

 

 

 

Comments are closed.