Office Peacocking : కార్పొరేట్ కంపెనీల్లో కొత్త ట్రెండ్.. ఈ సరికొత్త ఆఫీసు పీకాకింగ్ గురించి తెలుసా?

ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు కంపెనీ యాజమాన్యాలు తీసుకొచ్చిన కొత్త ట్రెండ్ ఆఫీస్ పీకాకింగ్. దీని గురించి తెలుసుకోండి.

Office Peacocking :  కార్పోరేట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. కరోనా రాకముందు ఉద్యోగులందరూ ఆఫీసుకు వెళ్లి తమ పనిని పూర్తి చేసుకునేవారు. కానీ, ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) జాబ్స్ చేశారు. కరోనా పోయినప్పటికీ పలు కంపెనీలు ఇంట్లో ఉండి వర్క్ చేయడాన్ని ప్రోత్సహించారు. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డారు.

అయితే, ఇప్పుడు టెక్ ప్రపంచంలో మరో కొత్త పేరు ట్రెండ్ అవుతుంది. అదే ‘ఆఫీస్ పీకాకింగ్’ (Office Peacocking). ఈ పేరు వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆఫీస్ పీకాకింగ్ అనే పేరు ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Office Peacocking

‘ఆఫీస్ పీకాకింగ్’ అంటే ఏంటి?

ఉద్యోగులు ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేయాలంటే వెనకడుగు వేస్తున్నారని పలు కంపెనీల పిర్యాదులు కూడా వినిపించాయి. ఆఫీసుకు రాకుండా ఇంటి నుండే పని చేస్తున్న ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రప్పించేందుకు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తూ.. కిచెన్ , సోఫాలు, లైటింగ్స్ ఆఫీసులను అలంకరించడం వంటివి ఏర్పాటు చేస్తున్నారు.

మరి కరోనా తగ్గి నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆఫీసుకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేని వారు దీని నుండి తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం వచ్చింది. చాలా కంపెనీలు ఈ ఆఫీస్ పీకాకింగ్ (Office Peacocking) విధానాన్ని అనుసరిస్తున్నాయని మాసాచూ సెట్స్ కేంద్రంగా పని చేసే ఓవెల్ లాబ్స్ (Oval lobes) సీఈఓ ఫ్రాంక్ వీషెఫ్ట్ తెలిపారు.

Office Peacocking

Comments are closed.