Pancard Number : పాన్ కార్డ్ వినియోగిస్తున్నారా? అందులో 10 అంకెల అర్దం ఏంటో మీకు తెలుసా?

ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను జారీ చేస్తుంది. పాన్ కార్డ్ లో ఉండే 10 అంకెలలు దీన్ని సూచిస్తున్నాయి.

Pancard Number : ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ లేకుండా ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేయదు. పాన్ కార్డు కూడా తప్పనిసరి అయింది.మనకి బ్యాంకు అకౌంట్ ఎలాగో.. ఆధార్ కార్డు ఎలాగో భారతీయులకు పాన్ కార్డు కూడా అంత ముఖ్యమైనదిగా మారింది. కొత్త బ్యాంకు ఖాతా నమోదు చేసుకోవాలంటే..రూ. 50 వేలకు మించిన లావాదేవీలకు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (Pan) అవసరం. అయితే పాన్ కార్డ్‌లోని ఆల్ఫాన్యూమరిక్ నంబర్ అంటే ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

పాన్ నంబర్ అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను జారీ చేస్తుంది. పన్ను సంబంధిత విషయాల కోసం భారతదేశంలోని వ్యక్తులు మరియు కంపెనీలకు ఒకే గుర్తింపును అందిస్తుంది. ఐటీ శాఖ పాన్ కార్డులను లామినేటెడ్ కార్డుల రూపంలో జారీ చేస్తుంది.

PAN card
అయితే, పాన్ నంబర్‌లోని పది అంకెల్లో ప్రతి అంకెకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది.ఆ అంకెలకు ఉన్న ప్రత్యేక అర్దం గురించి తెలుసుకుందాం.

అయితే, పాన్ నంబర్‌లోని మొదటి మూడు అంకెలు AAA నుండి ZZZ వరకు ఉంటాయి. ఇది కూడా ఆల్ఫబెటిక్ సిరీస్ తో ఉంటుంది. నాల్గవ అంకె పాన్ హోల్డర్ స్టేటస్ ను సూచిస్తుంది. అయితే, ఆదాయపు పన్ను శాఖ వ్యాపారాలు మరియు వ్యక్తులకు పాన్ కార్డులను జారీ చేస్తుంది.
A : అసోసియేట్ ఆఫ్ పర్సన్స్
B : బాడీ ఆఫ్ ఇండివిజవల్స్
C: కంపెనీ (సంస్థ)
F : సంస్థ లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్ షిప్)
G : ప్రభుత్వ ఏజెన్సీ
H : హిందూ అవిభాజ్య కుటుంబం (HUF)
J : ఆర్టిఫిషియల్ జ్యూరిడీకల్ పర్సన్
L : లోకల్ అథారిటీ
P : పర్సన్
T : ట్రస్ట్ వంటి ఈ అక్షరాలను కలిగి ఉంటుంది.

వ్యక్తిగత పాన్ కార్డ్ (PAN card) హోల్డర్లందరికీ నాల్గవ అక్షరం ‘P’. పాన్ నంబర్ లో ఐదవ అక్షరం దరఖాస్తుదారు లేదా ఇంటి పేరులో ఉండే మొదటి అక్షరం ఉంటుంది. పాన్ నంబర్‌లోని ఆరు నుండి తొమ్మిదవ అక్షరాలు 0001 నుండి 9999 వరకు ఉంటాయి. పాన్ నంబర్‌లోని 10వ అంకెను ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్ అంటారు. మొదటి తొమ్మిది అంకెలను అనుసరించి కంప్యూటర్ చివరి అంకెను జనరేట్ చేస్తుంది. దరఖాస్తుదారుడి పేరు, ఇంటి పేరు, ఇది వ్యక్తిగత దరఖాస్తునా…? లేక కార్పొరేట్ సంస్థ తరపున చేస్తున్నారా? అని పన్ను ఏజెన్సీ సమాచారం ఆధారంగా ఈ పది అంకెలను ఉత్పత్తి అవుతుంది.

Pancard Number

Comments are closed.