PM SVANidhi Yojana, Useful Scheme : ఎలాంటి హామీ లేకుండా రూ.50 వేల వరకు లోన్.. ఇప్పుడే అప్లై చేసుకోండి మరి!

వీధి వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి- ప్రధానమంత్రి స్వానిధి యోజన ప్రవేశ పెట్టారు. వివరాలు తెలుసుకుందాం.

PM SVANidhi Yojana : రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు సొంతంగా చిన్న వ్యాపారాన్ని (Small business) స్థాపించాలని చూస్తున్న ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక అద్భుతమైన పథకం ఉంది. చిన్న చిన్న వ్యాపారులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం (Central Govt) పెట్టుబడి సాయం అందజేస్తోంది.

వీధి వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు అందజేస్తుంది. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే వారికి మరుసటి సంవత్సరం రెండు రెట్లు రుణం లభిస్తుంది. PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి- ప్రధానమంత్రి స్వానిధి యోజన (PM SVANidhi Yojana) ప్రవేశ పెట్టారు.

పట్టణాలు మరియు ఇతర ప్రాంతాలలో రోడ్డు పక్కన వ్యాపారాలను కలిగి ఉన్న వ్యక్తులకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. 7% వడ్డీ తగ్గింపు కూడా ఉంటుంది. అంటే కేంద్రం 7 శాతం వడ్డీని చెల్లిస్తుంది. అదనంగా, డిజిటల్ చెల్లింపులు చేసిన వ్యక్తులకు క్యాష్ బ్యాక్ కూడా పొందుతారు. ఈ పథకం హోం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించింది.

PM SVANidhi Yojana

మార్చి 2022 లోనే ఈ పథకం పరిమితి ముగిసింది. అయినప్పటికీ, ఎక్కువ మంది ప్రజలకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని డిసెంబర్ 2024 వరకు పొడిగించింది. ఈ ప్రణాళికను గృహనిర్మాణ (Housing) మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. మార్చి 24, 2022 నుండి, పట్టణాల్లోని వీధి వ్యాపారులందరూ ఈ పథకానికి అర్హులు.

PM స్వానిధి పథకం ద్వారా రుణం తీసుకున్న వారు నిర్దిష్ట గడువులోపు తిరిగి చెల్లించినట్లయితే అదనపు ప్రయోజనాలు అందుకుంటారు. 7% వడ్డీ రేటు సబ్సిడీ లభిస్తుంది. మీరు డిజిటల్ లావాదేవీలతో చెల్లిస్తే, మీరు సంవత్సరానికి రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

వడ్డీ రాయితీ మరియు క్యాష్ బ్యాక్ కలిపి రూ.1600 వరకు ఆదా చేసుకోవచ్చు. తమ రుణాలను సకాలంలో చెల్లించే వారు తదుపరి విడతలో డబుల్ లోన్‌కు అర్హులు అవుతారు. తొలిసారిగా రూ.10వేలు రుణం అందించి, ఆ తర్వాత రూ.50,000 వరకు అందుకోవచ్చు. ఈ లోన్‌కు మీరు ఏవైనా స్థిర ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.

వీధి వ్యాపారులకు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలకు అర్హులు. కూరగాయలు, పండ్లు మరియు తోపుడు బండ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు నడుపుతున్నవారు మరియు బార్బర్‌షాప్‌ పెట్టుకున్న వారు ఈ పథకానికి అర్హులు. వారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణం లభిస్తుంది.

PM SVANidhi Yojanaఈ రుణాన్ని పొందడానికి, పట్టణ స్థానిక ప్రభుత్వం జారీ చేసిన వెండింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేకపోతే, ఎవరైనా వీధి విక్రేత గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. మీకు ఈ కార్డు లేకపోయినా లోన్ పొందవచ్చు. అయితే, గుర్తింపు కార్డును ముప్పై రోజుల్లో పొందాలి.

PM స్వానిధి అధికారిక వెబ్‌సైట్‌లోని గణాంకాల ప్రకారం, పెట్టుబడి సహాయం పొందడానికి 79,75,141 మంది వ్యక్తులు మొదటి విడత రుణం కోసం దరఖాస్తు చేశారు. మొత్తం 66,64,869 మందికి లోన్ శాంక్షన్ అయింది. వీరిలో 63,83,468 మంది రుణాలు పొందారు.

ఇప్పటి వరకు 26,08,118 మంది కస్టమర్లు మొదటి విడతలో రుణాన్ని చెల్లించారు. వీరిలో రెండో విడతకు 23,83,712 మంది దరఖాస్తు చేసుకోగా, 18,73,931 మందికి రుణం శాంక్షన్ చేశారు. మరోవైపు మూడో విడతగా 3,86,998 మంది దరఖాస్తు చేసుకోగా, 3,06,747 మందికి లోన్ మంజూరు చేశారు.

PM SVANidhi Yojana

 

Comments are closed.