Reliance Industries Limited Stock : రికార్డు స్థాయిలో రిలయన్స్ షేర్లు, రూ.19 లక్షల కోట్లు దాటిన స్టాక్ మార్కెట్ క్యాపిటలిజషన్

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ షేర్స్ అధిక లాభంతో ట్రేడవుతున్నాయి. మొదటిసారి, స్టాక్ మార్కెట్ క్యాపిటలిజషన్ రూ.19 లక్షల కోట్లు దాటింది.

Telugu Mirror : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ ముఖేష్ అంబానీ నేతృత్వంలో ఉంటుందని మనకి తెలుసు.భారతీయ కంపెనీలో అత్యంత విలువైన కంపెనీల్లో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. మరి, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఏ విధంగా ఉన్నాయి? రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ లో హెచ్చుతగ్గులు, లాభనష్టాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్  షేర్స్ గురించిన పూర్తి సమాచారాన్ని మేము మీకు ఈ ఆర్టికల్ ద్వారా అందించాలనుకుంటున్నాం. పూర్తి వివరాల కోసం పూర్తిగా చదవండి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ షేర్స్ అధిక లాభంతో ట్రేడవుతున్నాయి. మొదటిసారి, స్టాక్ మార్కెట్ క్యాపిటలిజషన్ రూ.19 లక్షల కోట్లు దాటింది. నవంబర్ నెలలో 4% పెరగగా, డిసెంబర్ నెలలో 9% పెరిగింది. ఈ నెల స్టాక్ 8% వరకు పెరిగింది. 2015 నుండి 2023 వరకు మొత్తం 11.5% లాభాన్ని పొందింది. డిసెంబర్ త్రిమాసికానికి రూ.17,265 కోట్ల వరకు లాభాన్ని పొందింది. నిన్న మధ్యాహ్నం 12:00 గంటలకు షేర్స్ BSEలో 4.11% పెరిగి ఒక్కొక్కటి రూ.2,821 వద్ద ట్రేడయ్యాయి.

reliance-industries-limited-stock-reliance-shares-at-record-level-stock-market-capitalization-crossing-rs-19-lakh-crore
Image Credit : SP Tulsian

Also Read : Honor : ఫిబ్రవరి 25న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న హానర్ మ్యాజిక్ 6 సిరీస్, హానర్ మ్యాజిక్ V2 సిరీస్

ఈరోజు రికార్డ్ స్థాయిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ షేర్స్ నమోదయ్యాయి. భారత మార్కెట్ 1200 పాయింట్ల మేరకు లాభాన్ని పొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,713.2 వద్ద ప్రారంభమై రూ.2,710.35 వద్ద ముగిసింది. నిన్న మార్కెట్ క్యాప్ 7శాతం పెరిగి 19,59,444.36 కోట్లకు చేరుకుంది. గత మూడు సెషన్లలో కంపెనీ షేర్లు 12 శాతం వరకు పెరిగింది.

ఈక్విటీ మార్కెట్లలో బలమైన పెరుగుదల కూడా ర్యాలీని ప్రోత్సహించింది, BSE సెన్సెక్స్ 1,240.90 పాయింట్లు లేదా 1.76 శాతం పెరిగి 71,941.57 వద్ద మరియు నిఫ్టీ 385 పాయింట్లు లేదా 1.80 శాతం పెరిగి 21,737.60 వద్ద ముగిసింది.

డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ₹17,265 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కంపెనీ యొక్క ఆయిల్ మరియు గ్యాస్ సెగ్మెంట్ రికార్డ్ త్రైమాసిక EBITDAని ప్రకటించింది, మార్జిన్ మునుపటి త్రైమాసికంలో 70% నుండి 86%కి పెరిగింది. Emkay గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా పేర్కొంది, “FY24 మూడవ త్రైమాసికంలో రిలయన్స్ ఎక్కువగా ఇన్-లైన్ ఫలితాలను పోస్ట్ చేసింది. O2C మరియు Jio EBITDA రెండూ మా అంచనాల కంటే కొంత తక్కువగా ఉన్నాయి, కానీ బలమైన అప్‌స్ట్రీమ్ (తక్కువ ఒపెక్స్ కారణంగా) మరియు ఇన్-లైన్ రిటైల్ ద్వారా ఆఫ్‌సెట్ చేయబడ్డాయి.” అని పేర్కొంది.

Comments are closed.