Tesla Layoffs 2024, valuable information : 14వేల ఉద్యోగుల తొలగింపు, షాకింగ్ నిర్ణయం తీసుకున్న టెస్లా సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా షుమారు 14వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పలు నివేదికలు వెలువడ్డాయి. టెస్లా కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చాయి.

Tesla Layoffs 2024 : 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియతో చాలా మంది ఉద్యోగులు అతలాకుతలం అయినారు. కేవలం సాఫ్ట్ వేర్ కంపెనీలే కాకుండా ఇతర రంగాలలో కూడా ప్రముఖ సంస్థల నుండి లే ఆఫ్ ల ప్రక్రియ కాస్త నెమ్మదించి మళ్ళీ ఊపు అందుకుంటున్న సమయంలోనే టెస్లా నుంచి విడుదలైన ఒక వార్త ఆందోళన కలిగించేదిగా ఉంది.

దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారీ సంఖ్యలో తన ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడింది. టెస్లా కంపెనీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులలో కనీసం 10శాతం, అంటే 14వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఉద్యోగాల తొలగింపు విషయమై సంస్థలోని ఉద్యోగులకు టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ తెలియజేసారు.

టెస్లా లేఆఫ్​ 2024..

‘రోల్స్ డూప్లికేషన్’ కారణంగా ప్రపంచవ్యాప్తంగా టెస్లా కంపెనీలలో పనిచేస్తున్న వారిలో కనీసం 14వేల మందిని తొలగించేందుకు ఎలాన్​ మస్క్​ సిద్దపడ్డారు.

Tesla Layoffs 2024

కొన్ని నివేదికల ప్రకారం “కంపెనీ, మరో దశకు పెరగడానికి తయారు అవుతోందని, ఖర్చులు తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచుకునేందుకు అవసరమైన అన్ని విషయాలను లెక్కలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసమై సంస్థలోని స్థితిగతులను సమీక్ష చేసి చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెస్లా ఉద్యోగులలో నుంచి 10శాతం మందిని తొలగిస్తున్నాము. ఉద్యోగుల తొలగింపునకు మించి నాకు నచ్చని విషయం మరొకటి లేదు. కానీ వారిని తొలగించక తప్పడం లేదు,” అని ఎలాన్ మస్క్ ఉద్యోగులకు ఈ-మెయిల్స్​ రాసి పంపినారు.

టెస్లా కంపెనీ లే ఆఫ్స్ తాజా వార్తలు :

“టెస్లా సంస్థ కోసం ఇన్ని సంవత్సరాలపాటు పని చేసిన వారందరికి కృతఙ్ఞతలు. మా మిషన్​లో మీరు పోషించిన పాత్రకు నేను మీకు కృతజ్ఞుడిని అందుకు మీకు ధన్యవాదాలు మీ భవిష్యత్తు అవకాశాలు బాగుండాలని ఆశిస్తున్నాను. మీకు గుడ్​ బై చెప్పడం చాలా కష్టం,” అని మస్క్​ చెప్పారట.

చైనా ఈవీ సంస్థల నుంచి టెస్లా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటుంది. గత కొంత కాలంగా టెస్లా గడ్డు పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితులలో సంస్థ డెలివరీలు, సేల్స్​ తగ్గుముఖం పట్టాయి. టెస్లా కంపెనీ పోర్ట్​ఫోలియోలోని ఎలక్ట్రిక్​ వాహనాలపై భారీగా ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాగానీ పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదు.

ఇండియాలోకి రానున్న టెస్లా..

ఇండియాలోకి ప్రవేశించేందుకు టెస్లా కంపెనీ అడుగు దూరంలో నిలిచింది. పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. టెస్లాను ఆకట్టుకునేందుకు భారతదేశంలో అనేక రాష్ట్రాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నెలలో ఎలాన్ మస్క్ ఇండియాకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రధానమంత్రిని కలిసే మీటింగ్​కి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదు, కానీ, ఈ పర్యటనలోనే భారత్ లో టెస్లా లాంచ్​పై ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Tesla Layoffs 2024

Comments are closed.