Today Gold Rates : నేడు మళ్ళీ పెరిగిన బంగారం ధరలు, పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 300 పెరుగగా రూ.57,700కి నమోదయింది.

Telugu Mirror : బంగారం కొనాలనుకునే వారికి షాక్. వరుసగా మూడు రోజులు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టగా ఒక్కసారిగా ధరలు పెరిగాయి. అయితే, ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 300 పెరుగగా రూ.57,700కి నమోదయింది. 24 క్యారట్ల బంగారం పై రూ.350 పెరిగగా నిన్న రూ.62,620 ఉండగా ఈరోజు అదే బంగారం రూ.62,950 గా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీ లో నిన్న 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 550 నమోదు కాగా ఈరోజు రూ.300 పెరిగి 57,850 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,770 నమోదు కాగా, ఈరోజు రూ.330 పెరిగి రూ.63,100 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 నమోదయింది.

Also Read : Today Gold Rates : నేడు కూడా తగ్గిన బంగారం ధరలు.. పసిడి,వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

వెండి ధరలు ఇలా ఉన్నాయి :

దేశ రాజధానిలో వెండి ధర పరిశీలించినట్లయితే, కిలో వెండి ధర రూ. 75,500 ఉండగా, ఈరోజు రూ.200 పెరిగి రూ.75,700 నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు :

మన తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో కిలో వెండి ధర రూ. 77,000 నమోదు కాగా ఈరోజు రూ.200 పెరిగి రూ.77,200 వద్ద నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.