Today Gold Rates : బంగారం కొనాలనుకుంటున్నారా? 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా?

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.62,950గా నమోదయింది.

Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఈరోజు శుభవార్త . వరుసగా రెండో రోజుల నుండి కూడా భారీగా ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.62,950గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే నిన్న ఎలా ఉందొ ఈరోజు కూడా ధర అలాగే ఉంది. ఎటువంటి మార్పు లేదు.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 850 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,100 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 నమోదయింది.

today-gold-rates-want-to-buy-gold-do-you-know-the-price-of-10-grams-of-gold

Also Read : Gold Rates Today : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్, తగ్గిన పసిడి, వెండి ధరలు.

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 పెరుగగా, అక్కడి బంగారం ధర రూ. 58,400 నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.110 పెరుగగా చెన్నై లో రూ. 63,710గా నమోదయింది.

తగ్గిన వెండి ధరలు : 

దేశంలోపలు ప్రధాన నగరాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ. 77,440గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నై లో కిలో వెండి ధర రూ. 77,500 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,000 వద్ద నమోదయింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 73, 500 గా నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,700 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,950 గా నమోదయింది. కిలో వెండి ధర రూ.78,000 వద్ద నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.