AP PECET 2024: ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ 2024 కి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ. ఫీజు లాస్ట్ తేదీ ఎప్పుడంటే..

AP PECET 2024: ఆంధ్రప్రదేశ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP PECET) 2024 కి నోటిఫికేషన్ విడుదలయింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంచే PECET నిర్వహిస్తారు. ఆన్ లైన్ లో అపరాధ రుసుము లేకుండా మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP PECET 2024: AP Physical Education Set 2024
Image Credit : Telugu Mirror

AP PECET 2024: ఆంధ్రప్రదేశ్‌ లో ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (Physical Education) కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్ 2024 (Common entrance test 2024) కి హాజరయ్యేందుకు దరఖాస్తు నమోదు ప్రక్రియ ప్రారంభం అయినది. రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సుతో పాటు రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ ఉన్నతవిద్యా మండలి ఆధ్వర్యంలో గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Acharya Nagarjuna University) PECET పరీక్షను నిర్వహించనుంది.

ఏపీలో ఉన్న యూనివర్శిటీ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో AP PE CET ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

వయస్సు, విద్యార్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి 19 సంవత్సరాలు కలిగి ఉన్న అభ్యర్ధులు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ (BPEd)కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా ఇన్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ (DPEd) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 16ఏళ్ల వయస్సు నిండి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము మరియు ఎక్కడ దరఖాస్తు చేయాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
•ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.900 •బీసీ విద్యార్ధులకు దరఖాస్తు రుసుము రూ.800.
•ఎస్సీ,ఎస్టీ విద్యార్దులకు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
•క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, నెట్‌ బ్యాంకింగ్, ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించవచ్చు

ఆన్‌లైన్‌లో మాత్రమే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నిర్వహించే AP PECET పరీక్షకు ఆన్‌లైన్‌ ఈ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

https://cets.apsche.ap.gov.in/PECET/PECET

ముఖ్యమైన తేదీలు:

•ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ మే15, ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించాలి.
•మే 22 వరకు రూ.500 ఫైన్ తో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
•మే 29 వరకు రూ.1000 లేట్ ఫీజ్ తో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
•జూన్ 30,31తారీఖులలో ఎడిట్ ఆప్షన్ అవకాశం ఉంటుంది.
•జూన్ 4న హాల్ టికెట్ లను జారీ చేస్తారు.
•జూన్ 11న సామర్ధ్య పరీక్షలను నిర్వహిస్తారు.
సామర్ధ్య పరీక్షలను నిర్వహించిన వారం లోపుగా ఫలితాలను వెల్లడిస్తారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లోనే ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.
దరఖాస్తుదారుల శారీరక సామర్ధ్యం మరియు క్రీడలలో నైపుణ్యం ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.

పరీక్షా విధానం మరియు ఇతర పూర్తి వివరాలకు ఈ లింక్ ఓపెన్ చేయడం ద్వారా తెలుసుకోండి.

https://cets.apsche.ap.gov.in/PECET/PECET

Comments are closed.