BHEL Recruitment : నిరుద్యోగులకు శుభవార్త..BHELలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే ఎంపిక..!

బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ డివిజన్ (EDN)లో సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం BHEL నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL)లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి గుడ్ న్యూస్. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్స్ డివిజన్ (EDN)లో సీనియర్ ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల కోసం BHEL నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. BHELలో ఈ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీగా నిర్ణయించారు.

Also Read : ESIC Recruitment : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. సెలక్ట్ అయితే రూ.1లక్షకు పైగా జీతం…!

పోస్టుల వివరాలు :

సీనియర్ ఇంజనీర్ – 19 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ – 10 పోస్టులు

సీనియర్ మేనేజర్- 04 పోస్టులు

మొత్తం: 33 పోస్ట్‌లు.

bhel-recruitment

దరఖాస్తు రుసుము :

UR/EWS/OBC అభ్యర్థులు రూ. 400 + 18%. GST మొత్తం రూ. 472 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. అయితే, SC/ST/PWD/Ex-Servicemen వర్గానికి చెందిన వ్యక్తులు దరఖాస్తు ఫీజు లో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

బీహెచ్‌ఈఎల్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకోసం ముందుగా అప్లై చేసిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి ఆ తర్వాత అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Also Read : SBI ATM Card Charges 2024: ఎస్బీఐ ఏటీఎం కార్డులు వినియోగిస్తున్నారా? అయితే, వాటి చార్జెస్ గురించి తెలుసా?

జీతం :

సీనియర్ మేనేజర్ స్థానాలకు ఎంపికైన వారికి రూ.70,000 నుండి రూ.2 లక్షల వరకు ఇస్తారు.

డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లిస్తారు.

సీనియర్ మేనేజర్ స్థానాలకు ఎంపికైన వారికి నెలకు రూ.లక్ష నుంచి రూ.2.60 లక్షల వరకు చెల్లిస్తారు.

BHEL Recruitment

Comments are closed.