Group-1 Results, Helpful news : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, మెయిన్స్ కి అర్హత సాధించినవారు వీళ్ళే

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ 12 రాత్రి ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

Group-1 Results : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ 12 రాత్రి ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. గ్రూప్-1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షకు హాజరైన దరఖాస్తుదారులలో 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను APPSC విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఫలితాలతోపాటు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన పేపర్-1, పేపర్-2 ఫైనల్ ఆన్సర్ కీలను ఏపీపీఎస్సీ అందుబాటులోకి తెచ్చింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఎంత శాతం ఉతీర్ణత సాధించారు? 

ఏపీలో గ్రూప్-1 పోస్టులకు మార్చి 17న జరిగిన ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. గ్రూప్-1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,26,068 మంది (84.67%) తమ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో 91,463 మంది (72.55%) పేపర్-1 పరీక్షకు, 90,777 మంది (72%) పేపర్-2 పరీక్షకు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయసేందుకు అనుమతి ఉంటుంది.

Group-1 Results

గ్రూప్‌-1 పరీక్ష ఇలా జరిగింది.

రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 301 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్‌-1 పరీక్ష జరిగింది. పేపర్-1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగాయి. మార్చి 19న, పరీక్ష ప్రాథమిక కీని అందించింది. అభ్యంతరాల నేపథ్యంలో ఏప్రిల్ 12న ఫైనల్ ‘కీ’ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

ఏపీలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 1న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు గ్రూప్ 1 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత గల అభ్యర్థులు జనవరి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటించిన టైమ్‌టేబుల్ ప్రకారం, గ్రూప్-1 స్థానాలను భర్తీ చేయడానికి మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్ పరీక్షకు వెళతారు.

మెయిన్స్ పరీక్ష ఈ విధంగా..

మెయిన్స్ పరీక్షలో ఐదు ప్రధాన పేపర్లు ఉంటాయి. అదనంగా తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు ఉంటాయి. అయితే, ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. ప్రధాన పరీక్ష 750 మార్కులకు ఉంటుంది. ప్రతి ఐదు పేపర్‌లకు 150 మార్కులు కేటాయిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మరియు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులు మొత్తం 825 మార్కులకు అభ్యర్థులను తీసుకుంటారు. ఒక్కో పేపర్‌కు 180 నిమిషాలు (3 గంటలు) కేటాయించారు. మెయిన్ పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతాయి.

మెయిన్స్ కి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

అధికారిక వెబ్సైటు — https://portal-psc.ap.gov.in/Default.aspx

Also Read : AP Academic Calendar 2024-25, useful news : ఏపీ ఇంటర్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల, పూర్తి వివారాలు ఇవే

Comments are closed.