Job in Samantha Company: సమంత దగ్గర జాబ్‌ చేయాలనుకుంటున్నారా, ఈ అర్హతలు ఉంటే చాలు, వెంటనే అప్లై చేసుకోండి..!

సమంత బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆమె వద్ద ఉద్యోగం చేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మీకు కనుక ఈ అర్హతలు ఉంటే ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.

Job in Samantha Company: చాలా మంది సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని అందరు కోరుకుంటారు. వారిని కలిస్తే సరిపోతుంది అని మరియు సెల్ఫీలు దిగేతే చాలు అనుకుంటారు. సెలబ్రిటీలు కనిపిస్తే జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిని అభిమానంతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వరు. అభిమానులు అత్యుత్సాహం వల్ల వారు సమస్యలను ఎదుర్కోవచ్చు.

దురదృష్టవశాత్తు, సూపర్ స్టార్‌లు ఈ అడ్డంకులను నవ్వుతూ ఎదుర్కొంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, మనలో చాలా మందికి స్టార్స్‌తో కలిసి పనిచేయాలని ఉంటుంది. కానీ వారిని ఎలా సంప్రదించాలో తెలియదు. మీకు కూడా అదే కోరిక ఉందా? అయితే టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత (Heroine Samantha) తో కలిసి పనిచేసే అవకాశం మీకోసం. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

సమంతకు టాలీవుడ్ లోనే కాదు సౌత్ అంతటా మంచి గుర్తింపు ఉంది. ఆమె ఆకర్షణీయమైన ప్రతిభావంతురాలు మాత్రమే కాదు, ఆమె ఎంతో దయగలది కూడా. అనేక సేవా కార్యక్రమాలు మరియు ఎన్నో మంచి పనులు చేయడం ఆమె మంచి గుణాన్ని చాటుతుంది. సమంత తన అందం మరియు నటన సామర్థ్యాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమె అభిమానులకు మరింత చేరువైంది. సామ్ ఇప్పటికే అనేక సంస్థలకు ప్రచారకురాలిగా పనిచేసినందుకు ప్రసిద్ధి చెందింది. కొన్నేళ్ల క్రితం ఆమె ‘సాకి’ అనే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ యొక్క డిజైనర్ వస్త్రాలు (Designer Dresses) ప్రస్తుతం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందాయి.

Also Read:  Sick Leave For Air India Staff: ఎయిర్ ఇండియా సిబ్బంది సిక్ లీవ్, 70 కి పైగా సర్వీసులు రద్దు

అయితే, సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లో చేసిన పోస్ట్‌ ఒకటి తెగ వైరల్‌ అవుతుంది. ఇంతకు ఇది దేని గురించి అంటే, సమంత దగ్గర జాబ్‌ చేసే అవకాశం గురించి తెలుపుతుంది. తనకు ఎంతో ఇష్టమైన ‘సాకి’ (Saaki) లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు సామ్‌ ప్రకటించింది. అవసరమైన అర్హతలు ఉన్నవారు సంప్రదించగలరు. ఆమె తన కంపెనీలో ఉపాధి వివరాలను వివరిస్తూ ఒక పోస్ట్ రాయగా, అది వైరల్ అయింది. ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ (Fashion Design Manager) /అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) , ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ (Fasion Design Executive) మరియు బ్రాండ్ మార్కెటింగ్ (Brand Marketing) వంటి ఉద్యోగాలు ఉన్నాయని ఆమె పేర్కొంది. ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారందరూ ఇంటర్వ్యూ (Interview)కు హాజరుకావచ్చని చెప్పుకొచ్చింది.

సమంతా పిల్లల కోసం ఏకమ్ ఎర్లీ లెర్నింగ్ సెంటర్ అనే ప్లే స్కూల్‌ను కూడా నిర్వహిస్తోంది. మీ పిల్లలను అందులో చేర్పించేందుకు కావాల్సిన వివరాలు తెలుసుకునేందుకు ఒక ఫోన్‌ నంబర్‌ను (9154900466) కూడా ఆమె షేర్‌ చేసింది. మరోవైపు సమంత ఒక సూపర్ ఫుడ్ కంపెనీ (Super Food Company) లో పెట్టుబడి పెట్టి ఏడాదికి మూడు మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. సమంత తన వ్యాపార కార్యక్రమాలతో పాటు అనేక రకాల స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తుంది.

Job in Samantha Company

Comments are closed.